భావగీతం :-భాషకందనిభావా.. ;- కోరాడ నరసింహా రావు !
పల్లవి :-
       భాష కందని భావా లెన్నో.. 
మదిన   పల్లవించేను..., 
   అవి నీతో పంచుకోవాలని.... 
మనసు తహ - తహ లాడేను!!
       " భాష కందని భావా.... "
చరణం :-
   పండితుడను కాను నేను... 
  అందముగా చెప్పలేను... 
  హృది మౌన రాగాలాపనలతో 
 పరవశించిపోతున్నాను !
 నేను పరవశించిపోతున్నాను!!
      "భాష కందని భావా..... "
చరణం :-
       ;నా మూగ భాషలు నీకు తెలుపగలిగే దెన్నటికో... !
 నన్ను నీ హృదయేశ్వరిగా... 
   చేసుకునే దెప్పటికో... !!
   నీవైనా తెలుసుకోవా.... 
  నీదానిగ  చేసుకోవా..... 
  నాజన్మము ధన్యమయేలా 
  నన్ను కరుణించవా... !
  నన్ను  కరుణించవా... !!
     నన్ను కరుణించవా... !!!
        ******

కామెంట్‌లు