మంచు ఎలా ఏర్పడుతుంది?;- ఎస్ మౌనిక

 హాయ్! హలో మై డియర్ ఫ్రెండ్స్!ఎలా ఉన్నారు?నేనైతే ఫుల్ హ్యాపీ..... మరి మీరు? ఈరోజు మీ నేస్తం ఇంకో కొత్త అంశంతో మీ ముందు ఉందిగా! అదేనండి!... మంచు ఎలా ఏర్పడుతుంది అన్న విషయమే మన ఈరోజు తెలుసుకోబోతున్నాం. మన చుట్టూ ఉండే గాలిలో నీటి ఆవిరి ఉంటుంది. దానినే మనం తేమ అంటాం కదా!.. చల్ల గాలిలో కంటే వేడి గాలిలోనే తేమ ఎక్కువగా ఉంటుందట. రాత్రివేళ వేడిగాలి చల్లగా ఉన్న ఉపరితలాన్ని తాకినప్పుడు దానిపై ఉన్న ఆవిరి నీటి కణాలుగా ఏర్పడుతుంది. ఈ నీటి కణాలనే మనం మంచు అంటాం.దీన్నే మనం ఒక చిన్న ప్రయోగం ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఒక గ్లాసులో మంచు గడ్డను లేదా చల్లని నీళ్లను పోసి కొన్ని నిమిషాల సేపు దానిని బల్ల మీద పెట్టాలి. గ్లాసు బయట ఉపరీతలంపైన చిన్న చిన్న బిందువులను మనం గమనించవచ్చు. సరిగ్గా ఇదే విధంగా చెట్ల మీద మరియు పచ్చిక పైన మంచు బిందువులు ఏర్పడతాయి. రాత్రి సమయంలో వీటి ఉపరీతలాలు చల్లగా ఉంటాయి. అందుకనే వీటిపై మంచు బిందువులు ఏర్పడతాయి. కొత్తగా ఉంది కదూ ఫ్రెండ్స్!..... ఇటువంటి ఎన్నో విషయాలను మీ నేస్తం మీ ముందుకు తెస్తూనే ఉంటుంది. సరే మళ్లీ త్వరలో కలుద్దాం ఫ్రెండ్స్! ఉండనా మరి!... బాయ్ ఫ్రెండ్స్ 👋👋
కామెంట్‌లు