మబ్బులు;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
మబ్బులు లేచాయి
ఆకాశాన్ని కప్పాయి

మబ్బులు కమ్మాయి
సూర్యుని ముట్టాయి

మబ్బులు గొడుగుపట్టాయి
ఎండతీవ్రతను తగ్గించాయి

మబ్బులు తేలాయి
గగనాన్ని అలంకరించాయి

మబ్బులు తిరిగాయి
మనసును దోచాయి

మబ్బులు కూడాయి
మెరుపులు మెరిశాయి

మబ్బులు కలిశాయి
ఉరుములు ఉరిమాయి

మబ్బులు కరిగాయి
చినుకులు పడ్డాయి

మబ్బులు కప్పాయి
జాబిలిని దాచాయి

మబ్బులు మాయమయ్యాయి
నింగిని శూన్యముచేశాయి

మబ్బులు పిలిచాయి
ఎక్కి స్వారిచేయమన్నాయి

మబ్బులు మురిశాయి
మనసును తేలికపరిచాయి

మబ్బులు ఎక్కుతా
మిన్నులో తిరుగుతా

మబ్బుల్ని వర్ణిస్తా
దృశ్యాలు చూపిస్తా

మబ్బుల్ని చూడమంటా
మోదమును పొందమంటా

మబ్బుల్లో విహరిస్తా
మాటల్లో వినిపిస్తా


కామెంట్‌లు