ఆయన భార్యమరణాన్ని తట్టుకోలేకపోయారు.లాజవంతి భార్యపేరుతో కవితలు రాసి పుస్తకాన్ని ప్రచురించారు.ఉర్దూలో కవితలు అల్లిన హిందువు.రసాయనశాస్త్రవేత్త.1955 నూతన సంవత్సరం ఒకటో తేదీన ఆయన మరణంతో దేశం గొప్ప రసాయనశాస్త్రవేత్తను కోల్పోయింది.
జనపనార కొబ్బరి చిప్పలతో ఉపయోగకరవస్తువులతయారీని ప్రోత్సహించారు.
చెరుకుపిప్పితో పశువులదాణా చేశారు. మనదేశంలో 11పరిశోధనాసంస్థల్ని ప్రారంభించారు.మైసూర్ కేంద్ర ఆహార పరిశోధనాశాల జంషెడ్పూర్ లోహపరిశోధనాశాల చెన్నై చర్మపరిశోధనాశాల మొదలైనవి.. లండన్ రాయల్ సొసైటీ లో ఫెలో గౌరవం పొందిన తొలి రసాయనశాస్త్రవేత్త.1941లోఆంగ్లప్రభుత్వం నైట్ హుడ్ తో సత్కరించింది.
ఆయన జీవితంలోకి తొంగి చూస్తే చాలా బాధకలుగుతుంది.9నెలల ఆపసివాడు తండ్రిచనిపోతే 21ఏళ్ళతల్లి పార్వతీదేవితో తాత ఇంటికి చేరాడు.తాత ప్యారేలాల్.భేడ అనే పల్లెలో(పాకిస్థాన్) పుట్టిన ఈ చిన్నారి పుస్తకాల
పురుగు.ఇంట్లో కవుల సమావేశాలు గోష్ఠులు చూస్తూ వింటూ ప్రతి చిన్న వస్తువుని విడదీసి మళ్ళీ వాటిరిపేర్లు చేసేవారు.తాత మహాస్ట్రిక్ట్.బైట ఆడుకోవడానికి పంపేవాడు కాదు.కానీ ఐదో ఏట తాత బడిలో చేర్చగానే ఎగిరి గంతేశాడు.టీచర్ "బాబూ! మీ నాన్న పేరేంటి?" అని అడగ్గానే భోరుమన్నాడు.ఈఘట్టం నిజంగా కంటినీరు తెప్పించింది.
చిన్న చిన్న బ్యాటరీలు కాలింగ్ బెల్ మొదలైనవి చేస్తూ హైస్కూల్ విద్యార్ధిగా ఆనాటి అలహాబాద్ నుంచి వచ్చే లీడర్ పత్రికలో సైన్స్ వ్యాసాలు రాశారు.టీచర్లు చెప్పే పాఠాలు వింటూ ప్రశ్నలు గుప్పించే వారు.14వ ఏట లాహోర్ దయాల్ సింగ్ కాలేజీ లో స్కాలర్షిప్ తో చదువుతూ కరామత్ అనే వ్యంగ్య హాస్య నాటిక రాసి నటించి డైరెక్టర్ గా మొదటిబహుమతి పొందారు.బి.ఎస్సీ విద్యార్ధిగా ఒక పరిశ్రమలోని సమస్యలు పరిష్కరించి 50రూపాయల బహుమతి పొందారు.కానీ పరీక్షలో ఫెయిల్ అయ్యారు.ఎందుకంటే పుస్తకంలో ఉన్న విషయం తోపాటు ఆనాటి పరిశోధనలు గూడారాయడంతో ఫెయిల్ అయ్యారు.1919 లో ఎం.ఎస్సీ ఆపై విదేశాలకి వెళ్లి మేడం క్యూరీని కూడా కలిశారు.1921లో లండన్ యూనివర్సిటీ నించి డాక్టరేట్ పొందారు.28వ ఏట పండితమాలవ్యా గారి ఆహ్వానం పై కాశీ హిందూ విశ్వవిద్యాలయం లో రసాయనశాస్త్ర విభాగంలో చేరారు.ఆయన రాసిన ప్రార్థనాగీతం ని ముఖ్య గీతంగా ఆయూనివర్శిటీ స్వీకరించింది.ఆయన చేసిన కొన్ని పరిశోధనలు ఇవి_కృత్రిమ నగల తయారీ నూనె కంపెనీల సమస్యలు తీర్చడం ఇలా ఎన్నో ఎన్నెన్నో!;,
ఆయన శాంతి స్వరూప్ భట్నాగర్.28వ ఏటలండన్ యూనివర్సిటీ నుంచి డాక్టర్ ఆఫ్ సైన్స్ పొంది బెనారస్ హిందూ యూనివర్సిటీ లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా మదన్మోహన్ మాలవ్యా బాధ్యత అప్పగించారు.కానీ 58ఏళ్ళ సీనియర్ ప్రొఫెసర్ " ఈ తాళంచెవి తీసుకోండి" అంటే " మీరు నాకన్నా అన్ని విషయాల్లో పెద్దలు.మీదగ్గరే ఉంచుకోండి" అని గౌరవం చూపిన శాస్త్రవేత్త!🌺

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి