ఎవరీ తెలుగు తేజాలు? అచ్యుతుని రాజ్యశ్రీ
 1 ఆంధ్ర గోఖలే గా ప్రసిద్ధి చెందిన ఈయన 1సెప్టెంబర్ 1868లో జన్మించారు.న్యాపతి సుబ్బారావు గారి వద్ద జూనియర్ లాయర్ గా చేరారు.ఆనాటి ప్రావిడెంట్ ఫండ్ కంపెనీల కుంభకోణాలు అన్నీ తూర్పారబట్టారు.లండన్ మొదటిరౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు.The Evolution of the Indian Constitution గ్రంధకర్త గా రిజర్వ్ బ్యాంక్ మొదటిబోర్డ్ డైరెక్టర్ గా పేరు గాంచారు.68వ ఏట1936లో అస్తమించిన ఈయన కు లండన్ నుంచి వెలువడే టైమ్స్ పత్రిక ప్రశంసలు కురిపించింది.
2ఆరునెలల ఆపసివాడు తల్లి చనిపోవడంతో  మేనమామ ఆలనాపాలనా లో పెరిగారు.చదువులో మొదటినుంచీ ఫస్ట్ మద్రాసులో  ఎం.ఎ.డిగ్రీ పొందిన రెండవ తెలుగు తేజం! బంగారు  పతకంపొందారు.
రాజమండ్రిలో రాత్రి పూట వయోజన విద్యాలయం నడిపారు.విజయవాడలో స్వరాజ్ పత్రికను నడిపితే ఆంగ్ల ప్రభుత్వం మూడేళ్ల జైలుశిక్ష విధించింది.జైలునించి విడుదలైన ఈయన తో మాట్లాడాలి అంటే జనం జంకారు.ఆంధ్రపత్రికకు తొలి సంపాదకునిగా ఉన్నారు.1919లోనేషనలిస్ట్ అనే ఆంగ్ల పత్రికను నెలకొల్పి ఘాటైన వ్యాసాలతో ఆంగ్లేయులను హడలెత్తించిన తెలుగుతేజం!భార్య రమాబాయి సంపాదకత్వంలో "స్త్రీల సౌందర్యవల్లి" అనే మాసపత్రిక నడిపారు.రామచరితం ప్రచ్ఛన్న పాండవం అనే నాటకాలు రాశారు.ఆనాటి హిందూ పత్రిక లో తెలుగు సాహిత్యం రచనలపై సమీక్షలు 20ఏళ్ళపాటు రాసిన ఘనత వీరికే దక్కుతుంది.గాంధీజీ రచనలను తెలుగులోకి అనువదించారు.ఆకాశవాణిలో ప్రసంగాలతో ఆకట్టుకున్న ఈమహామనీషి1960లో కన్నుమూశారు.🌷
1ఆంధ్రగోఖలే శ్రీ మోచెర్ల రామచంద్రరావు గారు
2శ్రీ గాడిచర్ల హరి సర్వోత్తమ రావుగారు 🌷

కామెంట్‌లు