తెలుగోళ్ళం;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
తెలుగువాళ్ళం మనం
తెలివైనవాళ్ళం 
ఆంధ్రులం మనం
అతిసుందరులం

తెలుగుతల్లిపిల్లలం మనం
తరతరాలవారసులం
తలెత్తుకొనితిరిగేవాళ్ళం మనం
తలవంపుపనులుచేయనివాళ్ళం

వికాసవంతులం మనం
విలువున్నవాళ్ళం 
కృషీవలులం మనం
కష్టపడేవాళ్ళం

బాగాచదివేవాళ్ళం మనం
ఉద్యోగాలుచేసేవాళ్ళం
విదేశాలాకువెళ్ళేవాళ్ళం మనం
విశేషంగాసంపాదిచేవాళ్ళం

ఎక్కడికైనావెళ్ళేవాళ్ళం మనం
ఆచారాలనువదలనివాళ్ళం
ఏకజాతిగానిలిచేవాళ్ళం మనం
అందరితోకలసిపోయేవాళ్ళం

వీరులంశూరులం మనం
పంతాలుపట్టింపులున్నవాళ్ళం
దేశభక్తికలవాళ్ళం మనం
జాతిసమైక్యతనుకాపాడేవాళ్ళం

తీపిగ
మాట్లాడుకుందాం
తేనెను
పంచుకుందాం

తేటగ
తెలుగునుపలుకుదాం
తెల్లారి
వెలుగునుతలపించుదాం

ఏపుగ
తెలుగుతోటపెంచుదాం
చక్కగ
తెలుగుపూలుపూయించుదాం

పరిసరాల
సుమసౌరభాలుచల్లుదాం
పొరుగోళ్ళ
మనసులుదోచేద్దాం

కమ్మగ
కవితలుకూర్చుదాం
చక్కగ
పాటలుపాడుదాం


కామెంట్‌లు