రైతే రాజైన వేళ;- డాక్టర్ చొప్పదండి రాధ

 సూర్యుని కిరణాల సుప్రభాతం
రైతన్నల మోములో చిరునవ్వుల చిద్విలాసం
అక్కా అన్నా పిలుపులతో
జీవనయానం ప్రారంభం
పొలం గట్ల మీద మయూరి నృత్యాల నడకలతో ఆడపడుచుల జీవన పోరాటం
మన జీవనం సాగడానికి అదే కదా తొలి ద్వారం 
రైతన్నల అమాయకపు, నిష్వార్ధపు, సేవాపూరితపు కష్టాలు
పొలం గట్ల మీద చల్లని గాలుల 
పరవశం 
కష్టం తెలియకుండా పాడుకునే జానపద గీతాలు
కష్టాల్లో నేనున్నాను అనే సాయం అందించే హస్తాలు
ఒకరికొకరం అందరం ఒకటే అనే భావాలు
భక్తి భావాలతో చేసుకొనే పండుగలు
మాలిన్యం లేని మనసుల మాటలు
ఊరంత ఒకే మాట మీద నడిచే 
ఆనందకర జీవితాలు
పెద్దల మాటలు చద్ధి మూటలు
అని నమ్మే యువకులు
భక్తి భావాలతో నడిచే బాలలు
భాద్యతలు తెలుసుకొని నడిచే 
పిల్లలు
వ్యవసాయమే జీవనాధారంగా బ్రతికే కుటుంబాలు
పంట చేతికొస్తే పరవశించి పండుగ చేసుకొనే ప్రజలు
ఆరోగ్యకరమైన వాతావరణలో
ఆనందకరమైన జీవనాలు
ప్రకృతి ఒడిలో హాయిగా సేద తీరే అమాయకపు ప్రజలు
అదే కదా ఇపుడు మనందరం కోరుకునే బ్రతుకులు
ఆరోగ్యకరమైన ఆనందకరమైన 
ప్రశాంతమైన జీవితాలు
రైతే రాజైన వేళ రాజ్యం కాదా రామరాజ్యం
ప్రజల మనసులు ఓలలాడవ ఆనందడోలికల్లో
జై రైతన్న జై జై రైతన్న
అందుకో మా వేవేల వందనాలు

కామెంట్‌లు