శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ

 మహాభారతం కథ మనందరికీ తెలుసు.కౌరవ పాండవులు భరతవంశంవారే.భరతవంశంవారి యుద్ధం కాబట్టి భారతం అని పేరు పెట్టారు.చేటభారతం అనే సామెత కూడా ఉంది కదా? పాణిని ఇలా అన్నాడు..సంగ్రామే ప్రయోజనం యోధదృభ్యః.పంచమవేదంభారతం.ఒక లక్షశ్లోకాలున్నాయి.శాంతిపర్వంలో స్త్రీని ఇల్లు గా పురుషునికి మిత్రునిగా తోడునీడగా చెప్పారు.ఆమె లేకుండా యగ్నయాగాలు జరగవు.రాజుకి బోలెడు మంది భార్యలు.దుర్యోధనుడికి కూడా చాలా మంది రాణులు అసూర్యం పశ్యలు.అంటేఎప్పుడూ సూర్యుని మొహంకూడా చూడకుండా రాణీవాసంలో పంజరంలో పక్షి లా బతికారు.భగవద్గీత వెలిసింది.నిష్కామభావంతో పని చేయమని చెప్పింది.మహామహోపాధ్యాయ అంటే గొప్ప పండితుడు విద్వాంసుడు అని అర్థం.ఇదొక బిరుదు.ఆంగ్లేయులకాలంలో సంస్కృత పండితులకు ఈబిరుదు ప్రదానం చేసే వారు 🌹
కామెంట్‌లు