సమస్యాపూరణం ;- మచ్చ అనురాధ
 జీతము లేనిదౌ కొలువు జేసిన వానికి మేలు సేకురున్ .
=========================================
ప్రీతిగ భార్య ,భర్తకిల ప్రేమగ  సేవలనందజేయుచున్
ఖ్యాతిని‌ పెంపుజేయ కడు గౌరవ మొప్పగ  మెట్టినింటికిన్
మాతలు నేర్పుచుందురిల మానక సంస్కృతి  వారసత్వ మన్ 
జీతములేనిదౌ కొలువు జేసిన వానికి మేలు సేకురున్.

కామెంట్‌లు