నీ జన్మ భూమి; శ్రీరేఖ బాకరాజు కెనడా
 చూడరా చూడరా 
భూతల స్వర్గమైన 
నీ జన్మ భూమిని 
పొగడరా పొగడరా 
తనివితీరా ఈ భరత భూమిని 
కన్నతల్లిని గౌరవించినట్లు 
జన్మభూమిని ఆదరించు 
నీ సేవతో కన్నభూమిని 
సుశ్యా మలం చెయ్యి 
నీ వంతు కృషినువ్వు చెయ్యి 
భారత భూమిని బంగరు భూమిగా 
సుసంపన్నం కావించుటకు
 బృహత్ పణ్రాళికా యాగంలో సమిధగా మారు 
వేరొకరొస్తారని ఏదోచేస్తారని 
ఎదురుచూపులు చూడకు పేరు పేరునా 
పజ్రలకు సేవ చెయ్యి 
కన్న బిడ్దగా నీ 
తల్లి ఋణం తీర్చు కో 
నలుగురికిసహాయమందిన
 నాడే ఈ మహిమహోన్నతమగు 
చూడరా చూడరా 
భూతల స్వర్గమైన 
నీ జన్మ భూమిని 
పొగడరా పొగడరా 
తనివితీరా ఈ భరత భూమిని


కామెంట్‌లు