మిథునం (వచన కవిత);- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 సన్నజాజులు సంపెంగలు
మురిపెంగా విచ్చుకున్నాయ్
ముద్దమందారాలు గులాబీలు
సిగ్గుతో ముడుచుకున్నాయ్ 
మొగలిరేకుల సుగంధాలు
నిట్టూర్పులైనాయ్
పారిజాతపరిమళాలు
సన్నగా నవ్వుకుంటున్నాయ్
చంద్రుడేమో దొంగై
మేఘాలమాటున దాక్కుని చూస్తున్నాడు
మలయానిలుడు పిరికివాడై
మెలమెల్లగా వీస్తున్నాడు
పూపొదలే మా నేస్తాలు 
పాపం! అవేకదూ
మమ్మల్ని ఎవరికంటా పడకుండా 
తమలో దాచుకుంటున్నాయ్ 
మేమెవరినీ పట్టించుకోవడం లేదు 
ఒకరినొకరం తప్ప
మేమే ఈ జగాన ప్రేమైక సౌందర్య మిథునం!!
*********************************

కామెంట్‌లు