బాలలు భాషలు!!!;- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పిఎస్ నంది వడ్డేమాన్ నాగర్ కర్నూల్ జిల్లా
తెలుగు నేర్చుకుంటే
తెనాలి రామలింగాలమవుతాం!!

ఆంగ్లం నేర్చుకుంటే
ఆకాశరామన్నలమవుతాం!!!

హిందీ నేర్చుకుంటే
గాంధీతాతల మవుతాం!!!

మీ ప్రాంతంలోనే
పంతులవ్వాలనుకుంటే
తెలుగు నేర్చుకుంటే చాలు!!

డాక్టరు ఇంజనీరు లాయరు
అవ్వాలనుకుంటే
ఇంగ్లీషు నేర్చుకుంటే చాలు!!! 

శాసనసభలో మాట్లాడాలనుకుంటే
తెలుగు వస్తే చాలు!!

పార్లమెంటులో మాట్లాడాలనుకుంటే
హిందీ ఇంగ్లీషు నేర్చుకోవాలి!!!

గల్లీ నాయకుడు అవ్వాలనుకుంటే
తెలుగు చాలు!!

ఢిల్లీ నాయకుడు అవ్వాలనుకుంటే
హిందీ ఇంగ్లీషు రావాలి!!

ఇప్పుడు జాతీయ విద్యా విధానం వచ్చింది
సాంప్రదాయ విద్య
వృత్తివిద్యాలన్నీ తెలుగులోనే!!!?

మా జాతీయగీతం ఒకటే
మా జాతీయ జెండా ఒకటే
మా భాషలు మాత్రం మూడు!!!?

15 th Aug స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని.


కామెంట్‌లు