మల్లాది రామకృష్ణ శాస్త్రి ;- కొప్పరపు తాయారు
 ఈయన వచన , రచన కవిత్వానికి  మేస్త్రి అని అంటారు ఒక పెద్ద కవిగారు.
         ఈయన బందరులో జన్మించారు.వీరు మొత్తం
నలుగురు, ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు అప్పచెల్లళ్ళు . ఈయన చెప్పేది తనంతట తనుగా కాకుండా  పాత్రోచితంగా చెప్పే మహానుభావుడు. ఎన్ని భాషలు లెక్క తెలియదు కానీ భాషలన్నిటిని పట్టిన  వ్యక్తి.భాషను చదవడం వలన కాదు, మాట్లాడడం లోనే బాగా  నేర్చుకోవచ్చు. అనే మహా మనిషి ఆనందాలు పంచేమనిషి, హస్యాలను వెదజల్లే మనిషి. మహా అపురూప సంతోషాల నిలయం .
           రాసిన పాట "కుడి ఎడమైతే పొరపాటు లేదు" అనే పాట దేవదాసులో, రాశారు అంటే కుడి అంటే దేహం అని అర్థం  ఎడం అంటే దూరం . ఇందులో భావం లోతుగా ఆలోచిస్తే వేదాంతాన్ని తెలియచెప్తుంది.  అలాగే "కనుపాప కరువైన కనులెందుకు, తనవారేపరులైన  బ్రతుకెందుకు , తనవారే తనవారు విడిపోరులే కనుఇమూసి గగనాన కలిశారులే". అనే పాట చిరంజీవులు సినిమాలో..
           ఎంత ఎంత గొప్ప భావం ఎంత బాధ దానిని దాచుకోవాలో అంతా ఇందులోనే ఉంది. ఇక్కడ కలవకపోయినా స్వర్గంలో అందరం కలుస్తాం అనే ఆశాదీపం ఇది అద్భుతం సామాన్య మానవుల స్థాయిలో వేదాలను అందజేసిన మహానుభావుడు.
        అంతరంగంలోబాధ అంతర్గతం అని అందరికీ చెప్పలేం అందుబాటు ని అంతు పట్టని ఎద వ్యధ ఇలాంటి స్థితి మనసులో పెట్టుకొని అందరితో ఆనందంగా ఉండాలని సూచన ఆయన కవితలలో పాటలలో జీవితమే ప్రతిబింబిస్తుంది.
            నవకాయ పిండి వంటలు ప్రయోగం ఎంతమందికి తెలుసు ఆయన రచనలు చదివితే నే లేకపోతే అర్థం కావు. సామెతలు దగ్గర్నుంచి ఆయన నవలలు క్షుణ్ణంగా చదివితే అన్నీ అర్థం అవుతాయి
    ఆయన ఒక   గంభీర జలధి  ఎంత రాసిన ఇంకా  ఉంటూనే ఉంటుంది.

కామెంట్‌లు