.చిత్రానికి కవిత ; -. కోరాడ నరసింహా రావు !

తెలుసుకోవాలనే జిజ్ఞాసే నీకుంటే....., 
 ఓ పొత్తములోని జ్ఞానాన్ని సంగ్రహించి... 
    నీ వో... ఉత్కృష్ట గ్రంధమువై.... 
  ఈ ప్రపంచానికి.... 
  నీవుపొందిన జ్ఞాన, విజ్ఞానాన్ని
 అనేకానేక గ్రంధములుగా వెలయించి....., 
.  జ్ఞాన వితరణ గావించ గలవు
అందుకే..., 
    ఓ మనిషీ.... !
    నీ వో   నిరంతర విద్యార్థివి కావలసిందే... జ్ఞాన సముపార్జన గావించవలసిందే 
 ఒక దివ్వె, వేయి దివ్వెలను వెలిగించునటుల... జ్ఞానము అనంతమై విస్తరించవలె...
    ఆవెలుగులలో ఈ జగతి... 
  ఆనంద మయము కావాలె !!
        ******

కామెంట్‌లు