కాడెడ్లకు జోల ( చిత్రానికి బాలగేయం ) - ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
పల్లె వలస వెళ్ళింది
కూలి వాళ్లు లేరచట

కాడెడ్లకు జోల కట్టి
చంటి బిడ్డ నందు బెట్టి

ఎడ్ల మెడల మువ్వలు
ఘల్లు ఘల్లున మోగగా

జోల పాటలా వింటూ
నిద్రపోయే చంటి బిడ్డ

చిన్నగా బిడ్డను చూస్తూ
కన్న తండ్రి దుక్కి దున్నగా

విత్తనాలను పట్టుకొని
కన్నతల్లి విత్తులేయగా

పెరడంతా దున్ని నాక
కాడెడ్లను విడిచినాడు

కన్న బిడ్డను నెత్తుకొని
చెట్టు నీడకు చేరినారు

సను పాలు తాపీ బిడ్డకు
గరుక మీద వేసినారు

తెచ్చిన సద్దిని తిన్నారు
ఆకలి తీర్చుకున్నారు


కామెంట్‌లు