నా బాటసారి అతిథులూ వెళ్ళిపోయారు. నా పిల్లలూ ఆత్మీయులూ మరిచిపోయారు. నా సొగసైన అందాలూ మారిపోయాయి.
నా చేతిలో పనులన్నీ అయిపోయాయి.
నాజీవితాన వసంతం వెళ్ళిపోయింది.
నా శరీరవృక్షానికి శిశిరం వచ్చేసింది. అయితేనేం ..., మొన్ననే నానుదుటన కవితానెలవంక సిందూరం దిద్ది నా ప్రియమిత్రుడు కనబడని లోకానికెళ్ళిపోయాడు. ఆ తదుపరి నా ఆలోచనాసంద్రాన కవితా చంద్రోదయమయింది. ఇక ఇప్పుడు నాపూదోటలో పువ్వుల నవ్వులజల్లులు, గుండెలోతుల్లో పరీమళాల జాతరలు. ఈ ప్రపంచాన్నే మరిపించేంత ప్రశాంత దినాంతాలు. జీవితాన్ని గెలిచానన్న సంతోషపుసంపద. ఇదంతా కవితానెలవంక సిందూరం నా నుదుటదిద్దిన నానేస్తపు భిక్షేకదా! అందుకే...నా కవిత్వం వెలుగుపువ్వై వికసించి, పగలూరాత్రీ తేడాలేక, నన్ను మోడులా మిగలనీయక, నా జీవితాంతం నేను నడిచేదారిలో వెన్నెలలు విరజిమ్ముతోంది !!!
++++++++++++++++++++++++
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి