E. తరం పిల్లలు... !
మహా మేధావులు !!
వీళ్ళవి కంప్యూటరు మెదళ్ళు
వీరి ముందు నిలువ లేరు....
. వీరి తాతలు - ముత్తాతలు !
వీరి ఆటల్లో - పాటల్లో...
నవీనతా జిలుగులు... !!
చెప్పునే, సెల్లును చేసేస్తారు
సులువుగా సెల్ఫీ తీసేస్తారు !
నిజంగా ఫోటోలు తీసుకున్నట్టే
సూపర్ పోజులు పెట్టేస్తారు !!
నేటి వీరి ఈ నటనా కౌశలంతో
సులువుగా ఈ సమాజంలో...
సత్తా చాటుతు బ్రతికేయ గలరు !!
నేటి తరమునకు,నిన్నటితరం
నేర్పవలసినదేముంటుందిక ?
ఈ తరమే... మొన్నటి తరముకు నేర్పెదరు నవ విజ్ఞానం... !!
*******
E. తరం పిల్లలు... !;- కోరాడ నరసింహా రావు !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి