జీవన సార్ధకత.;- డా. పివిఎల్ సుబ్బారావు,- 94410 8797.
 4. 
   ఏ మతమైనా మౌఢ్యం,
             జాడ్యం వ్యక్తిగతం !
    
   మనిషి మనిషికి మధ్య,    
                    పెంచె దూరం!
    
   ప్రపంచాన సృష్టించే ,
            సదా అల్ల కల్లోలం !
   
    మతాల దురుసుతనం,   
              మందులేని రోగం!
   
    పరమత సహనం ,
       మనకు చెదిరిన స్వప్నం!
5.
     ధర్మమేగా జనహితము,
              అది సామాజికము!
      
     మానవత్వమే ప్రథమ,
                      ప్రధాన ధర్మం !
       
     తద్వారానే సహజీవనం,  
                 విశ్వాస సంభవం!
   
     సహజీవన ఆశయం,
               సర్వజన సంక్షేమం!
    
    అదే విశ్వజన సమ్మతం,
                        శాంతి పథం!
6.
   మానవత్వం ,
                  జీవన నవనీతం!
  
   నవనీతం కరిగి,
                 మరిగితే ఘృతం,
 
     ఘృతం పంచామృతం,
                     హోమ ద్రవ్యం!
     
     అభిషేకం, యజ్ఞాల,
                  సరి వినియోగం!
   
   సద్వినియోగ మానవత్వం,
               జీవన సార్ధకత్వం!
________
రేపు కొనసాగుతుంది. 


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం