జీవన సార్ధకత.;- డా.పివిఎల్.సుబ్బారావు.- 9441058797.
 10.
    మనిషి సుర అసుర గుణాల,  
                         మిశ్రమమే!
 
     ఏవి వృద్ధి చేసుకుంటే,
         ఆ రూపం పొందడమే!
    క్షీర నీర మిశ్రమం ఏది ,
          పెంచితే ఆ లక్షణమే! 
  మహాత్ముడు, దురాత్ముడు,    
                ఏదైనా అతడే !
చరిత్రవంతుడు,చరిత్రహీనుడు,   
                  కాగలడతడే!
11.
     యుగాల పరివర్తనం,
               కలియుగ ప్రభావం!
    
     నాగరికతా వికాసం,   
                మానవతాపతనం!
    
    నేడు ప్రపంచం ,
         అర్ధకామాలేలే రాజ్యం!    
  
   పట్టించుకోనిది ధర్మం, 
        ఆలోచనే లేనిది మోక్షం!
   
   మరి ఇక ఈ జీవనం ,
     కల్లోల సాగర నావ చందం!
12.
    ఏమున్నది ఏచరిత్ర ,
       చదివినా గర్వకారణం!        
  
    విశ్వమంతా నేడు ,
        జీవన లక్ష్యం ఏకైకం !   
  
  ఆర్ధికోన్నతే సర్వమానవ ,
             ప్రధాన ఆశయం !
  
  బతకడం అంటే ధనం,
             చుట్టూ తిరగడం!
 
  ఎలాగైనా గెలవడమే,
              ఈ యుగ ధర్మం!
________
రేపు కొనసాగుతుంది.
  

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం