58.
జీవితంలో,ఆశ్రయాలైన,
ఆశ్రమాలు పోయాయి?
వృద్ధాశ్రమాలు పుష్కలంగా,
బాగా ఆకర్షిస్తున్నాయి!
కుటుంబం అంటే ఎవరు?
ప్రశ్న వచ్చింది !
కలిసే ఉంటారు ,
ఎవరికి వారు యమునా తీరే!
మానవత్వం "సారీ,"
జవాబు లేని, ప్రశ్నే!
59.
తామసం తారస్థాయికి,
వెళ్ళింది !
రాజసమే అంతటా,
రాజ్యమేలుతోంది !
సాత్వికం తన ,
సత్తా కోల్పోతోంది !
మృదుత్వం మనిషి ,
మాటలోనే కరువయ్యింది!
మానవత్వం,
డిక్షనరీకి పరిమితమైంది!
60.
"తాను పట్టిన కుందేలుకు, మూడే కాళ్లు" మూర్ఖత్వం!
" నేను ఒక్కడినే బాగుండాలి",
దుష్టత్వం!
"నేనెవరిని లెక్కచేయను",
మొండితనం!
"మోసపూరితంగానేఆలోచిస్తా",
కుటిలత్వం!
ఇలా ఎన్నో తత్వాలు ,ఎవరి,
అంతర్నేత్రం మానవత్వం?
_________
రేపు కొనసాగుతుంది.
జీవన సార్ధకత.- డా.పి.వి.ఎల్.సుబ్బారావు,9441059797.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి