నానుడి కథలు ౼ డా.దార్ల బుజ్జిబాబు

 తుగ్లక్ పాలన
------------------
        ఇది చారిత్రక ఆధారంగా వచ్చిన నానుడి. మంచి వాడు, తెలివిగల వాడు, మేధావి  అయి ఉండి కూడా  తన  సొంత నిర్ణయంతో, ప్రజల అభిప్రాయానికి విలువ ఇవ్వకుండా  ఇష్టానుసారంగా పాలన చేసే వారి పరిపాలనను తుగ్లక్ పాలనతో పోలుస్తారు.  వారు తీసుకునే నిర్ణయాలు ప్రయోజనం కలగజేయ పోవడమే కాకుండా  తీవ్ర నష్టాన్ని కూడా తెచ్చిపెడతాయి. అయినా వారు తమ నిర్ణయాన్ని సమర్ధిస్తారు. ఈ తుగ్లక్ పాలన అనే నానుడి ఎలా వచ్చిందో చూద్దాం. 
   తుగ్లక్  ఒక  ఢిల్లీ సుల్తాన్. ఇతడి అసలు పేరు మహ్మద్ బీన్ తుగ్లక్. 1325 నుండి 1351 వరకు పరిపాలన సాగించాడు. ఇతడు మహా పండితుడు, విద్యావేత్త, కళాకారుడు, మంచి ఆలోచన పరుడు. 1325లో ఢిల్లీ సింహాసనం అధిష్టించాడు. అయితే అతని పరిపాలనలో అనేక అపశృతులు దొర్లాయి. అవన్నీ అతడు తీసుకున్న అనుచిత నిర్ణయాల వల్లనే జరిగాయి.
    అందులో ఒకటి రాజధాని మార్పు. ఢిల్లీని  దేవగిరికి మార్చాడు. ప్రస్తుతం దాన్ని దౌలతబాద్ గా పిలుస్తున్నారు. కనీస సౌకర్యాలు కల్పించకుండా కార్యాలయాలను, పరిపాలనను మార్చటంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. కనీసం మంచినీరు సదుపాయం కూడా లేదు. ఒక వెలుగు వెలిగిన ఢిల్లీ భూతాల దిబ్బగా మారింది. ఈ మార్పు వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగక పోగా తీవ్రంగా నష్టం వాటిల్లింది. రెండేళ్ల తరువాత, ఆర్ధిక నష్టం చాలా జరిగిన తరువాత  తిరిగి యధాస్థానం ఢిల్లీకి మార్చాడు. ఈ మార్పుల కారణంగా ప్రజా ధనం ఎంతో దుర్వినియోగం అయింది.
    ఇక రెండోది నాణాల మార్పు. అప్పటి వరకు బంగారు,వెండి నాణాలు మాత్రమే మారకంలో ఉండేవి. వాటి స్థానంలో ఇత్తడి,రాగి నాణాలు ప్రవేశపెట్టాడు.( కొంత మంది తోలు నాణాలు కూడా ప్రవేశ పెట్టాడని చెబుతారు) ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో, ప్రయోజనం ఏమిటో ఎవరికి తెలియదు. మంత్రులను సలహాలు అడగడు. వారు చెప్పేవి పాటించడు. దీనితో ప్రజలు వెండి బంగారు నాణాలు దాచిపెట్టుకుని  ఇత్తడి రాగి నాణాలు సొంతగా తయారు చేసుకుని వినియోగించారు. దీనితో ప్రభుత్వ ఖజానా దివాళా తీసింది.  చేతులు కాలాక  వెంటనే ఆ నిర్ణయం మార్చుకున్నాడు. తిరిగి వెండి బంగారు నాణాలు చెలమణిలోకి తెచ్చాడు.
     ఇలా తుగ్లక్ చక్రవర్తి అనేక అభాసుపాలైన నిర్ణయాలు తీసుకున్నట్టు చెబుతుంటారు. ప్రజాభిప్రాయం లేకుండా, ప్రజా ప్రయోజనం లేని సొంత నిర్ణయాలు తీసుకుని, ఆర్ధికంగా నష్ట పోయి  తిరిగి పాతవాటినే అమలుచేసే  పాలకుల పాలనను "తుగ్లక్ పాలన" నానుడితో పోలుస్తారు.
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం