పర్యావరణ హిత గణపతి; -: సి.హెచ్.ప్రతాప్

 వినాయకుడు ఆది దేవుడు. ఏ శుభకార్యమై నా వినాయకుడి పూజతోనే ప్రారంభం అవుతుం ది. అందుకే హిందువుల పండుగల్లో వినాయక చవితికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ పర్వదినం వచ్చిందంటే చాలు ఊరూరా, వీధి వీధినా వినా యక విగ్రహాలను కొలువుదీర్చి తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహి స్తారు.ఈ నేపథ్యంలో పర్యావరణాన్ని దృష్టిలో ఉం చుకొని మట్టి వినాయకులను ప్రతిష్టించాల్సిన అ వశ్యకత, రసాయనాల ప్రతిమల వల్ల కలిగే అన ర్థాలపై విసృత స్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ప్రతీ ఒక్కరిపై వుంది.పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య నివారణ కు బంకమట్టితో తయారు చేసిన విగ్రహాలను వి నియోగించడం శ్రేయస్కరం. చెరువులు, వాగుల, సమీపంలో దొరికే బంకమట్టితో ప్రతిమలు చేసి వాటికి సహజసిద్ధమైన రంగులద్ది తక్కువ ఖర్చు తో అందమైన విగ్రహాలను తయారుచేసే వీలుం ది. మట్టి ప్రతిమలను పూజిస్తే దేవుడితో పాటు ప్రకృతినీ పూజించినట్టే అవుతుంది.ఈ అవగాహనా కార్యక్రమాల ఫలితంగా కొద్దిలో కొద్ది మందైనా మట్టి వినాయకులకే పూజలు చేయడం ప్రారంభించారు. అలా సముద్రంలో ఆవగింజంత మార్పు ప్రారంభమయ్యింది. పర్యావరణ ప్రేమికులు ప్రతి ఏడాది వలే ఈ సంవత్సరం కూడా వినాయక చవితికి మట్టి గణపతి ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేయాలి. ప్లాస్టిక్‌తో తయారు చేసిన ఎలాంటి వస్తువులూ వినియోగించవద్దని కూడా ప్రచారం చేయాలి. పత్రి కోసం చెట్లను నరకవద్దని, పర్యావరణానికి హాని కలిగించవద్దని, దానివల్ల జరిగే అనర్థాలను ఏకరువు పెట్టడంతో పాటు అటువంటి వారిపై చర్యలు తీసుకునే విధంగా చట్టాలలో కూడా మార్పులు తేవాలి.మట్టి గణపతి ని పూజిద్దాం..పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనే నినాదం తో ప్రతీ ఒక్కరూ రాబోయే వినాయక చవితి వేడుకలను జరుపుకోవాలి.
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం