సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -273
శల్యక వానాఖు న్యాయము
******
శల్యక అంటే ఎముక, బాణము, మేకు, శరీరంలో గ్రుచ్చుకొని  బాధించుచున్న ఇతర పదార్థము, విశేష దుఃఖ కారణము అనే అర్థాలు ఉన్నాయి. ఆఖు అంటే ఎలుక, చుంచెలుక పందికొక్కు అనే అర్థాలు ఉన్నాయి.
చుంచెలుక  ఏం చేస్తుంది? రాత్రి పూట పడుకున్న వారి పాదాలను, వేళ్ళను నిశ్శబ్దంగా వచ్చి( నిద్ర ఉన్నప్పుడు) నొప్పి కలుగకుండా కరిచి పారిపోతుంది.
అంటే యిబ్బంది, బాధ ఎదుటి వ్యక్తికి  తెలియకుండానే తమ పబ్బం గడుపుకోవడాన్ని,  కబుర్లతో మాయ చేయడాన్ని,మాటలతో మస్కా కొట్టడాన్ని,నొవ్వకుండా చెవులు కుట్టడం అంటే  నొప్పి తెలియకుండా నొప్పించడాన్ని  "శల్యకా వానాఖు న్యాయమ"ని అనవచ్చు.
చుంచెలుక వలెనే తేలు కూడా తాను చేయవలసిన పనిని మెల్లగా చేసుకొని పోతుంది. చడీచప్పుడు కాకుండా లోపలికి వచ్చి మనుషులను కుట్టి పోతుంది.
అలాగే మనుషుల్లో కొందరు ఇతరులకు హానీ,కీడు అత్యంత చాకచక్యంతో చేసి దాని బారిన పడిన వారు ఎవరివల్లో ఏమో అని గుర్తింప లేని విధంగా బాధ ,నష్టం కలిగించి పోతారు.
మహాభారతంలో కర్ణుడు పరశురాముని వద్ద విద్యాభ్యాసం  చేస్తాడు .అది ముగిసిన తర్వాత ఓ రోజు పరశురాముడు అలసిపోయి కర్ణుడి తొడ మీద తలపెట్టి పడుకుంటాడు. ఆ సమయంలో ఓ రాక్షసుడు కుమ్మరి పురుగు రూపంలో వచ్చి కర్ణుడి తొడ తొలుస్తుంటుంది. అలా తొలవడంతో కర్ణుడి తొడకు గాయమై కారుతున్న రక్తం పరశురాముడికి తాకి  మెలకువ వస్తుంది. ఏం జరిగిందో చెప్పమని కర్ణుడిని అడిగితే "కుమ్మరి పురుగు తొడను తొలిచింది. మీకు నిద్రాభంగం కలుగకూడదని దానిని ఏమీ అనలేదు." అంటాడు.
ఇలా ఓ కుమ్మరి పురుగు నొప్పి తెలియకుండా కర్ణుడిని నొప్పించి పరశురాముడి ఆగ్రహానికి గురి అయ్యేలా చేస్తుంది.
 ఇలా  బాధేంటో, కలిగే నష్టం ఏమిటో గుర్తించే లోపలే  తమ దుర్మార్గమైన పనులను చేసి పోయేవారిని ఉద్దేశించి మన పెద్దలు ఈ "శల్యక వానాఖు న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం