అమ్మ భాష;- Dr. అరుణాకోదాటి -నంది అవార్డుగ్రహీత,-అరుణో దయ, అరుణరాగాల సంస్థల అధ్యక్షురాలు.
అమ్మ నుడికారం  కన్నా కమ్మ దనంతో  కూడుకున్న భాష.
తెలుగు రాష్ట్రాలైన  ఆంధ్ర భాష, తెలంగాణా  ప్రజల భాష.

త్రిలింగ పదం  నుండి "తెలుగు " అనే  పదం  గా అవతరించిన  భాష
తీయని  తేనె లొలుకు బాష  మన తెలుగు   బాష .

ఎందరో  రాజులు అభిమానించి  పోషించిన  భాష మన తెలుగు బాష
నన్నయ, తిక్కన, ఎఱ్ఱన లాంటి  ఎందరో  మహాకవుల కలం  నుండి  జాలువారిన  కవిత్వంతో  నిండిన  బాష
బ్రతుకు తెరువుకు నేర్చుకో అన్య భాషలు
మాట్లాడు మన మాతృ బాష  తెలుగులోనే!

మాతృబాషను  కాలదన్నుతూ
పరబాషను పొగిడే  ఆల్పుడివి కాకు
అన్ని బాషలను  ఆదరించు.. కానీ ..
అమ్మబాష  యందు ఆత్మీయుడిగా
నిలువు
మాతృ బాషను  మాట్లాడాలంటే  పదాలను  వెదుకుతున్నావంటే అంత దుర్గతికి  కారణం నేనే  అనుకోవాలి  ప్రతిఒక్కరు,

గర్భ గుడిలో  మౌనంగా
  ఉన్నప్పుడు  పడలేదు నాతల్లి బాధ,
మాటలొచ్చి  మాట్లాడ లేక పోతున్న
మాతృ బాషను మరిచి పోయినప్పుడు ఘోషస్తుంది  తెలుగు తల్లి!

పట్టణాల్లో తెలుగుకు తెగులు  పుట్టే
పల్లెల్లో  పరాయి  భాషలు 
ఫరిడిళ్ళు తుండే!

పాఠశాలలో  ఆంగ్లం అందలాలెక్కే!

పద్య గద్యాలు పాతబడే
ఆంద్రసాహిత్యం  మూలపడే!
బాషలెన్ని   నేర్చినా , భావాలను వ్యక్త పరచడంలో 
మన మాతృ భాష తెలుగుకు సాటి రాదు ఏ బాష  అయినా!


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం