నలుగురి మాట!!; - ప్రతాప్ కౌటిళ్యా
మన జీవిత దేశానికి అమ్మ చెప్పిన మాట
ఒక రాజ్యాంగం లాంటిది
ఒక్క మాట పొల్లు పోదు
ఒక్క మాట మర్చిపోలేం మనం!!!

మనం నరకంలో ఇరుక్కున్నప్పుడు
నాన్న చెప్పిన మాట ధైర్యం లాంటిది
స్వర్గానికి ఒక ద్వారం లాంటిది
ఎప్పటికీ మర్చిపోలేని ఒక గొప్ప మాట నాన్న మాట!!!

మనం ఎదగడానికి
ఎక్కడికైనా ఎగిరిపోవడానికి
నదిలా పారడానికి
భవిష్యత్తుకు ఉపనిషత్తు లాంటిది గురువు మాట!!
భూమితో గాలి బంధం లా
ఎప్పటికీ వీడిపోని మర్చిపో నీ మాట గురువు మాట!!!?

అహంకారం పై ఆత్మగౌరవం ఓడిన
బానిసత్వం వీడి స్వాతంత్ర పోరాటంతో
స్వేచ్ఛ స్వాతంత్రం తెచ్చిన
మన తాత మాట గాంధీ తాత మాట
మనం ఎప్పటికీ మరువలేం!!!
ఈ నలుగురి మాట మన నలుగురి మాట!!!

గాంధీ జయంతిని పురస్కరించుకొని

Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏
8309529273.

కామెంట్‌లు