*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* -*శతరుద్ర సంహిత --(0299)*
 శౌనకాది మునులు, సూత మహర్షి సంవాదంలో.....

వరాహకల్పము -  శివుని యక్క 10 నుండి 18 యోగేశ్వర అవతారముల వర్ణన........ రుద్రని చేత చెప్పబడిన శంకరుని చరిత్ర.....

*"ఓం నమః శివాయ శుభం శుభం కురు కురు శివాయ నమః ఓం"*

*నందీశ్వర, సనత్కుమార సంభాషణం :*

*రుద్రుడు చెపుతున్నారు, అని నందీశ్వరుడు (నం.) చెపుతున్నారు:* 
*బ్రహ్మ దేవా! మొదటి చతుర్యుగ ఇరవై ఎనిమదవ ద్వాపరంలో భగవంతడైన శ్రీహరి, పరాశర మహర్షి కుమారుడుగా పుట్టిన "ద్వైపాయనుడు" వ్యాసుడు అవుతారు.  అప్పడు శ్రీహరి తన ఆరవ అంశతో వసుదేవునికి కుమారుడుగా పుట్టి, "వాసుదేవుడు" అని పిలవబడతాడు. అదే సమాయానికి, యోగాత్మకుడను అయిన నేను కూడా, లోకాలకు ఆశ్చర్యము కలిగే విధంగా యోగమాయ ప్రభావముచేత బ్రహ్మచారిగా అవతరిస్తాను. తరువాత, యోగమాయ సహాయంతో, బ్రాహ్మణులకు మంచి చేయడానికి, శ్మశానంలో చనిపోయి పడిపోయి ముక్కలుగా కాకుండా ఉన్న శరీరములో జొరపడతాను. ఆ తరువాత, బ్రహ్మ వైన నీతోను, విష్ణువుతోను కలిసిమేరు పర్వతము మీద వున్న ఒక చక్కటి గుహలో ప్రవేశిస్తాను. అప్పుడు నన్ను, "లకువీ" అంటారు. నా శరీర అవతారము దాల్చిన ప్రదేశము "ఉత్కృష్ట సిద్ధ క్షేత్రము" గా పిలువబడుతుంది. ఈ శరీర అవతారములో కూడా నాకు, గొప్ప తపశ్శక్తి గల కూశికుడు, గర్గుడు, మిత్రుడు, పౌరుష్యుడు అనే నలుగురు కుమారులు ఉంటారు. వీరు, వేదవేదాంగ శాస్త్రాదులలో నిష్ణాతులు, ఊర్ధ్వరేతస్సు గల బ్రాహ్మణు యోగులై ఉంటారు. చివరకు మహేశ్వరయోగము పొంది శివ సాయుజ్యము పొందుతారు.*

*ఇరువై ఎనిమిది మన్వంతరాలలో, ప్రతీ మన్వంతరములో కూడా వ్యాసుడు ఉంటారు. ప్రతీ ద్వాపరములో కూడా, కలియుగ ఆరంభములో, యోగేశ్వర అవతారము కలుగుతుంది. ప్రతీ యోగేశ్వర అవతారములో, స్వామికి నలుగురు కుమారులు ఉంటారు. వీరు శరీరము నిండా విబూది పూసుకుని, నుదిటిపైన త్రిపుండ్రము పెట్టుకుని, ఎల్లప్పుడూ, మనసులోను, బయటా కూడా శివార్చన చేస్తూ ఉంటారు. వీరు వేదవేదాంగములు చదివినవారు, ధర్మపరాయణులు లింగార్చనయందు తత్పరులై ఉంటారు. వీరు జ్ఞాన నిష్ఠాపరులు, జితేంద్రియులు కూడా.*

*ఈ విధంగా బ్రహ్మ మీద కరుణ కలిగిన పరమేశ్వరుడు, తన ఇరవై ఎనిమిది యోగేశ్వర అవతారములను వర్ణించి తెలిపి, అంతర్ధానము అయ్యారు.*

*ఇతి శివమ్*

*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*

.... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం