అడుగుజాడల్లో ఆనవాళ్లు - డా.నీలం స్వాతి,-చిన్న చెరుకూరు గ్రామం,-నెల్లూరు.-6302811961.
 మరుసటి రోజు ఉదయాన్నే బయలుదేరి దుర్గి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న పాటి మట్టి పొలంలో రెడ్డి గారు జగన్నాథం గారు చెన్నుపాటి సీతారామయ్య గారి అబ్బాయి శిల్పి చెన్నుపాటి శ్రీనివాస్ చారి (శ్రీను) కలిసి తిరుగుతున్నారు ఎందుకంటే అది పురాతన స్థావరం అని అక్కడ రకరకాల పూసలు ఇటుక రాతి ముక్కలు ఎర్రగా మెరిసే కుండ పెంకులు  చూశానని జగన్నాథం గారు చెప్పారు అది కచ్చితంగా శాతవాహన స్థావరం అయి ఉంటుందన్న రెడ్డి గారి నమ్మకం నిజం అయింది ఆ పొలంలోనే కాదు చుట్టుపక్కల దాదాపు 100 ఎకరాల్లో చారిత్రక గుళ్ళు ఉన్నాయి జగన్నాథం గారికి ఉన్నటు వంటి బాగా ఎర్రగా నగిసిగా ఉన్న చిన్న కుండ దొరికింది  రెడ్డి గారిని రమ్మని పిలిచారు  అటు వెళుతూ వెళుతూ నేరంతా  నేలంతా  కళ్ళు చేసుకొని చూస్తున్న రెడ్డి గారికి ఒక  బలపపురాయి శిల్పం దొరికింది.
పాటి మట్టిలో ఉన్న ఆ బొమ్మని తీసి చూశాడు రెడ్డి గారు ఆశ్చర్యం అది శివుని మహేశ మూర్తి బొమ్మ వక్ష స్థలం వరకే ఉంది జటాజోటం ముఖ కవళికలు  పరిశీలించిన తర్వాత ఇక్ష్వాకుల అనంతర కాలానికి  (క్రీస్తు శకం నాలుగో శతాబ్ది) కి చెందినదని జగన్నాథం గారికి చెబితే  ఆయన కళ్ళు పత్తికాయల వెలిగిపోయాయి ఆ బొమ్మకు అనేకసార్లు నమస్కరించుకున్నాడు ఆ బొమ్మ దొరకడం ద్వారా దుర్గి చరిత్ర ఒక్కసారిగా శాతవాహన ఆనంద గోత్రీకుడి కాలానికి 2007 వెలకు వెళ్లిపోయింది  దుర్గి లో ఉన్న దుర్గమ్మ శివ వీరభద్ర గోపీనాథ ఆలయాలను చూడ్డానికి  కాలినడకన వెళ్లారు  ఎప్పుడో 13వ శతాబ్దంలో కాకతీయ గణపతి దేవుడు అధికారి ఆ ఊర్లో కోట కట్టే ముందు దుర్గకు గురి కట్టడాల ఆ ఊరికి దుర్గి అని పేరు వచ్చిందని క్రమంగా అదే పేరు స్థిరపడిందని స్థానికులు అంటారు.
ముందుగా దుర్గా దేవాలయానికి వెళ్లారు రెడ్డి గారు ఎత్తైన దిబ్బ చుట్టూ చెల్లాచెదురుగా పడి ఉన్న మండల స్తంభాలు ఆలయ విడిభాగాలు శాసనాల శకలాలు మెట్ల ఎక్కి పైన చూస్తే గుడి నుంచి విడివడిన ద్వార శాఖలు  దూలాలు కప్పు రాళ్లు కాకతీయ శిల్పకళ ఉట్టిపడుతున్న వీరభద్ర నరసింహ సూర్య చెన్నకేశవ గణేష రతి మన్మథ నాగరాజు శిల్పాలు ఒకనాటి దొరికి వైభవ లకు సాక్షిభూతాలు  ఉత్సవాలకు పొలిమేరసాయన రంగులు శిల్పాల ప్రాచీన  ప్రాచీన తను తుడిచి వేశాయి. పూజారిని బతిమలాడి అనవసర  అలంకారాలు వస్త్రాలను అమ్మవారి ఒంటి మీద నుంచి తియ్యించి అసలు స్వరూపం చూశాడు రెడ్డి గారు  దుర్గా- మహిష మర్దని ఎంత అందంగా ఉంది.


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం