భీష్మ పరశురామ యుద్ధం! అచ్యుతుని రాజ్యశ్రీ

 పరశురాముడు తన శిష్యుడైన భీష్ముడికి అన్ని విద్యలు నేర్పి గురువుని మించిన శిష్యుడిగా తయారు చేశాడు.ధర్మంకోసం యుద్ధం చేస్తూ బాధపడేవాడు భీష్ముడు.ఆరోజు పరుశురాముని బాణాలధాటికి సొమ్మసిల్లి రథంలో పడిపోయాడు.బ్రాహ్మీ ముహూర్తం లో కలవచ్చింది. బ్రాహ్మణ రూపంలో వసువులు పితృదేవతలు గా వచ్చి" భీష్మా! ఒక్క మోహనాస్త్రంతో మాత్రమే నీగురువుని జయించగలవు" అన్నారు.అంతే భీష్ముడికి ఆవిద్య గుర్తుకొచ్చింది.మర్నాడు యుద్ధంలో ఆఅస్త్రాన్ని ప్రయోగించబోతుండగా ప్రకృతి రోదించసాగింది.నారదుడు పరుగెత్తుకొచ్చి" భీష్మా! ఆయన నీగురువు.ఆయన్ని ఓడించడం నీధర్మంకాదు. అందరికన్నా గొప్పవాడు గురువు." అని శాంతింపజేశాడు.అలాగే పరుశురాముని తండ్రి జమదగ్ని మహర్షి వచ్చి" నాయనా! నీశిష్యుడు భీష్ముడు దైవాంశ సంభూతుడు.కన్న బిడ్డలకన్నా మిన్న శిష్యుడు.ఆవేశం కూడదు." అని శాంతింపజేశాడు. ఇలా పగ కక్షతో రగిలిపోతున్న వారిని రెచ్చగొట్టే కాకాబాకా రాయుళ్ళవల్ల దేశంలో ప్రపంచంలో హత్యలు హింస క్రూరత్వం పెరుగుతున్నాయి.గురుశిష్యులు అంటే తల్లీ పిల్లల కన్నా మిన్నగా ఉండాలి.తన విద్యార్థులచేత మంచి అనిపించుకునే టీచర్ జన్మ ధన్యం.బాగా పాఠంతోపాటు ఆప్యాయత ప్రేమ ను పంచిన టీచర్ని విద్యార్థులు సదా గుర్తుంచుకోవాలి.ఇందుకు అబ్దుల్ కలాం సాక్షి 🌹
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం