జానకి;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 రామాయణం అనగానే రాముని కథ అనుకుంటాము నిజానికి అది రాముని ప్రయాణం అంతేకాదు అది రాముని ప్రయాణంతో పాటు జానకి ప్రయాణం కూడా  సీతారాముల సమన్వయ చరిత్రగా గ్రహించాలి మహర్షి వాల్మీకి రామాయణం అనే ఒక శబ్దంలో సీతారాముల అమర జీవిత చరిత్రలను నిబంధించాడు ఈ విధంగా రామాయణంలో సీత రాముడు ఇద్దరికీ సమానమైన ప్రతిపత్తిని కల్పించాడు వాల్మీకి అందుచేతనే అనేక సందర్భాలలో పర్యాయపదరూపంలో రమా అను శబ్దాన్ని ప్రయోగించాడు ఈ విషయాన్ని బలపరచడం కోసం మహర్షి ఒకే శ్లోకంలో ఒకే పంక్తిలో రామ... రమా శబ్దములను ప్రయోగించాడు  వన సౌందర్యానికి ముగ్ధురాలు అయిన జానకి కుతూహలాన్ని వాల్మీకి  అభివ్యంజనా పూర్ణమైన భాషలో ఇలా అంటాడు బాలేవరమతే సీతా బాలచంద్ర నిభానస రామ  రామే హృదీనాత్మా విజనే అపివనేసతీ
ఈ రామా రమా శబ్దములలో ప్రయోగంలో దాశరథి జానకి ఇద్దరును ఒకే ఒక పరమ సత్యము యొక్క రెండు ముఖాలనీ తెలుసుకోవాల్సి ఉంది ఈ స్త్రీ పురుషులలో మనం దర్శించే  అభిన్నత్వం అలౌకికం ఈ అభిన్నత్వాన్ని హనుమంతుడు మాత్రమే అశోకవనంలో జానకిని సందర్శించినప్పుడు చూడగలిగాడు  జానకి దేవా మాయేవ నిర్మాతగా అభివర్ణించబడింది ఈ ఆశ్చర్యకరమైన వ్యక్తిత్వ రహస్య నిర్మాణం బాలకాండలో మనం బాగా గమనించగలం  జానకి వివాహానికి పూర్వం కానీ వివాహ సమయంలో కానీ జన సామాన్యం ఎదుట ఒక్క మాట మాట్లాడినట్టు కనిపించదు  ఆమె సౌందర్య విశేషాలు కూడా ఎక్కడ ఎక్కువగా వర్ణించబడి ఉండలేదు  రాముని అసామాన్య పరాక్రమమును గురించి కేవలం తన తండ్రిని కలిసినప్పుడే ఆమెకు తెలియ వచ్చింది నిజానికి వాల్మీకి సీతారాముల కల్యాణ ఘట్టాన్ని చాలా సాధారణంగా జరిగినట్లు చూపించాడు కానీ తర్వాతే కవులు వివాహ ఘట్టాన్ని అత్యంత రమణియంగా మలిచి చూపించడం మొదలుపెట్టారు.
వనవాసానికి శ్రీరాముడు బయలుదేరే సమయంలో ఆయనలోని విషాదఛాయల్ని గుర్తించిన జానకి మొట్టమొదటిసారిగా మాట్లాడడం ప్రారంభించింది  ప్రభూ ఏమయింది అంత ఉదాసీనంగా కనిపిస్తున్నారు ఎందుకు? వనవాసంలో మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు నేను మీతో వనవాసానికి సంతోషంగా వస్తాను అనుమతించండి అని జానకి కోరుతుంది  వనవాసంలో కలిగే అనేక కష్టాలను గురించి శ్రీరాములు  జానకి కి చెప్పుతూ తన అయిష్టతను  తెలియజేస్తాడు  కానీ జానకి ప్రభూ మీకు నేను ఏ మాత్రం భారం కాబోను నావల్ల ఏ ఇబ్బంది రాదు అని చెప్తుంది  కానీ శ్రీ రాముడు అంగీకరించకపోవడం గమనించిన జానకి కఠినంగా  ప్రభు మీరు ఇంత పిరికిపందని నా తండ్రికి ముందే తెలిసి ఉంటే నన్ను మీకు ఇచ్చి వివాహం చేసేవాడు కాదేమో అని దెప్పి పొడుస్తుంది ఆ మహాతల్లి. చివరకు శ్రీ రాముడు అంగీకరిస్తాడు.


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం