కడుము పాఠశాల విద్యార్థులకు నగదు పారితోషికం

 గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను ప్రోత్సహించేందుకు హైదరాబాద్ ఉల్లాస్ ట్రస్ట్ వారు నగదు పారితోషికాలను బహూకరించడం మిక్కిలి అభినందనీయమని 
కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు అన్నారు. 
పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన హైదరాబాద్ ఉల్లాస్ ట్రస్ట్ ప్రతినిధి ఎస్.ప్రసన్నకుమార్ మాట్లాడుతూ 
చదువుల్లో ముందంజలో ఉండీ, తగు ఆర్ధిక పరిస్థితులు అనుకూలంగా లేక నిరుత్సాహంలో ఉన్న విద్యార్థులను ఉత్సాహపరిచేలా తమవంతు కృషి చేస్తున్నామని అన్నారు. 
రెండు తెలుగు రాష్ట్రాలలో 
మారుమూల గ్రామాల్లోని విద్యార్థుల ప్రతిభను పెంపొందించే దిశగా పయనింపజేయుటే తమ ఉల్లాస్ ట్రస్ట్ లక్ష్యమని ప్రసన్నకుమార్ అన్నారు. 
పాఠశాలలో తొమ్మిదో తరగతి పదోతరగతి చదువుతున్న విద్యార్థులలో అత్యంత ప్రతిభావంతులైన పదిమంది విద్యార్థులను ఎంపిక చేసి ఒక్కొక్కరికీ వెయ్యి రూపాయలు చొప్పున మొత్తం పదివేల రూపాయల నగదు పారితోషికాలను ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు, ప్రసన్నకుమార్ ల చేతులమీదుగా బహూకరించారు. 
తొమ్మిదో తరగతిలో బూరాడ రోజా,  బి.జోహన, బి.సమీర, వలురోతు లక్ష్మి, బి.సాయిగణేష్ లు, 
పదో తరగతిలో వమరవల్లి రుషితరుణ్, సారిపల్లి శశికిరణ్, కిల్లారి లావణ్య, కె.దీప్షికాశ్రీ, యామిని సింహాద్రిలు అత్యంత ప్రతిభావంతులుగా ఎంపికై, ఒక్కొక్కరూ వేయి రూపాయల నగదు పారితోషికాలను పొందారు. 
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు, ఉపాధ్యాయులు తూతిక సురేష్, దార జ్యోతి, పెయ్యల రాజశేఖరం, బండారు గాయత్రి, వల్లూరు లక్ష్మునాయుడు, శివకల శ్రీవాణి, బత్తుల వినీల, పడాల సునీల్, జన్ని చిన్నయ్య, కుదమ తిరుమలరావు, ముదిల శంకరరావు, కింజరాపు నిర్మలాదేవి, బోనెల కిరణ్ కుమార్, గేదెల వెంకట భాస్కరరావు, గుంటు చంద్రం, వై.నరేంద్రకుమార్, రవికుమార్ మహాపాత్రో, సస్మితా పాఢి, సింగంశెట్టి మురళీకృష్ణ పాల్గొన్నారు.
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం