జటాయువు పార్కు! అచ్యుతుని రాజ్యశ్రీ

 రావణుడు సీతను పుష్పక విమానం లో ఎత్తుకు పోతున్న ప్పుడు ఆమె ఏడ్పు విన్నాడు జటాయువు.ఆయన పక్షిరాజు దశరథుని మిత్రుడు.వృద్ధుడైనా హోరాహోరీగా రావణుని తో యుద్ధం చేస్తూ గాయపడి నేలకూలాడు. సీతను వెదుకుతూ వస్తున్న రామలక్ష్మణుల కి సీతజాడను రావణుని గూర్చి చెప్పి ప్రాణం వదిలాడు.తండ్రికి చేసి నట్లే జటాయువు కి భక్తి శ్రద్ధలతో కర్మకాండలు చేశారు ఆసోదరులు.ఆజటాయు నేచర్ పార్క్ కేరళలో కొల్లం జిల్లాలో చదయామంగళం అనే పల్లెలో ఉంది.65ఎకరాలున్న పార్కులో200 అడుగులు పొడవు 150 అడుగులు వెడల్పు 70అడుగుల ఎత్తు న్న జటాయువు మనదేశంలో అతిపెద్ద శిలా విహంగ విగ్రహం! ప్రపంచంలో కూడా సుమా! రాజీవ్ ఆంచల్  అనే ఫిల్మ్ నిర్మాత ఆర్టిస్ట్ బుర్రలో మెరిసింది ఈఊహ.దీని తయారీకి 7ఏళ్ళు పట్టింది.
ఈపక్షిలోపల ఆడియో విజువల్ డిజిటల్ మ్యూజియం కూడా ఉంది.రామాయణంని వివరిస్తుంది. పౌరాణిక గాథప్రకారం గాయాలతో జటాయువు చాదయామంగళం లో కొండశిఖరంపై నేలకూలాడు.ఇక్కడే రాముని కి రావణుని గూర్చి సీతాపహరణం తెల్పి ప్రాణం విడిచాడు.సరిగ్గా ఆకొండపై ఈభారీ శిలా విగ్రహం ఉంది.మనదేశం లో ఇన్ని విశేషాలు చరిత్ర పురాణాలకు సంబంధించిన ప్రాంతాలు న్నాయి.🌹
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం