మైత్రి! అచ్యుతుని రాజ్యశ్రీ

 స్నేహం మధురం.ఆపదలో ఆదుకునేవాడు హితుడు స్నేహితుడు మాత్రమే.మనం మంచివారితో కల్సిమెల్సి ఉంటే మనకూ మంచి బుద్ధి గుణాలు అబ్బుతాయి.నేడు బడిపిల్లలు మాదకద్రవ్యాలు పబ్ కి బార్ కి వెళ్లడం సామాన్య మైంది.మనసమ ఉజ్జీలతోటే స్నేహం చేయాలి.సజ్జనసాంగత్యం శ్రేయోదాయకం.పురాణాలప్రకారం ఆదిశేషుడు ఈ భూమిని తనవేయి పడగలపై మోస్తున్నాడు.విశ్వామిత్రుడుఒకరోజు" ఆదిశేషా! నాదగ్గరకు రా! కాసేపు భూగోళం నా పక్కన పెట్టు" అనగానే నాగరాజు అలాగే చేశాడు.అంతే భూగోళం పాతాళంలోకి జారిపోసాగింది.ఖంగారుగా విశ్వామిత్రుడు తన తపశ్శక్తితో దాన్ని ఆపేప్రయత్నం చేసి విఫలుడైనాడు.అప్పుడు నారదుడు వచ్చి అన్నాడు" నీవు సజ్జనమిత్రునితో కల్సిమెల్సి ఉన్న పుణ్యాన్ని ధారపోయి" అని సలహా ఇస్తాడు.అప్పుడు చేసేదేమీ లేక తను వశిష్ఠ మహర్షి దగ్గరకు వెళ్ళి నప్పుడు లభించిన పుణ్యాన్ని ధారపోస్తాడు.అంతే భూగోళం పాతాళంలోకి జారుకుండా ఆగిపోయింది.అప్పుడు ఆదిశేషుడు దాన్ని మళ్ళీ తన తలపై పెట్టుకొన్నాడు.అందుకే సజ్జనసాంగత్యం బాల్యంలోనే కలగాలి.అమ్మనాన్నలు ఈవిషయం తప్పక గమనించాలి 🌹
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం