తిరుప్పావై ; - వరలక్ష్మి యనమండ్ర
2 వ పాశుర భావము
*********
వైయత్తు వాళ్ వీర్ గళ్ ! నాముమ్ నమ్బావైక్కు
    శేయ్యుం కిరిశైగళ్ కేళీరో, పాఱ్కడలుళ్
    పైయ త్తుయిన్ఱ పరమనడిపాడి
    నెయ్యుణ్ణోమ్ పాలుణ్ణోమ్ నాట్కాలే నీరాడి
    మైయిట్టెళుదోమ్ మలరిట్టు నామ్ ముడియోమ్
    శెయ్యాదన శెయ్యోమ్ తీక్కుఱళైచ్చెన్ఱోదోమ్
    ఐయముమ్ పిచ్చైయుంఆన్దనై యుంకైకాట్టి
    ఉయ్యుమాఱెణ్ణి యుగన్దేలో రెమ్బావాయ్.
                    *** 
తెలతెలవారెను చెలియలు లెండి
కృష్ణుని పూజకు సంసిద్ధులు కండీ
యశోద కొమరుని చూతము రండి
శేష శయనునీ కీర్తింతుము రండీ
వేగమె రండి చెలులారా, గోపికలారా... కృష్ణా

స్వామి చరణములు పూజించెదము
పాటలు  పాడీ నందను కీర్తించెదము
కాత్యాయని వ్రతమును చేయుదము
నియమములన్నియు తెలిసికొందము
వేగమె రండి చెలులారా! గోపికలారా.... కృష్ణా

పెద్దలందరిని గౌరవింతుము
పండితులందరిని సేవించెదము
పేదలకు దానములు చేయుదము
చేటు మాటలను మాటలాడము
వేగమె రండి చెలులారా గోపికలారా.. కృష్ణా

పెద్దలందరిని గౌరవింతుము
పండితులందరిని సేవించెదము
పేదలకు దానములు చేయుదము
చేటు మాటలను మాటలాడము
వేగమె రండి చెలులారా గోపికలారా.. కృష్ణా

నిరాహారులమై మనముండెదము
ప్రాతః కాలము స్నానము చేతుము 
కనులకు మేము కాటుక పెట్టము
దీన బాంధవునికి పూజ చేయుదము
వేగమె రండీ చెలులార! గోపికలారా!.. కృష్ణా
***********


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం