చిన్నారులు;- వినయ్- ఆరవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా9666558614
   అనగనగా నాగపురి అనే గ్రామం ఉండేది. ఆ ఊరిలో ఒక పేద కుటుంబం ఉండేది. చిన్న పెంకుటింట్లో సుభాష్, రేఖ ఉండేవారు. వారికి చంటి, బంటి అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. కొడుకులు ఇద్దరు చాలా చిన్నవారు. సుభాష్, రేఖలు ఎంత కష్టపడి పని చేసినా, వచ్చిన డబ్బులకంటే ఎక్కువగా ఖర్చు చేయసాగారు. బాగా అప్పులు చేసినారు. ఒకసారి ఇద్దరు బాగా అప్పులు అయినాయని భయపడ్డారు. ఆ భయానికి సుభాష్, రేఖ దంపతులిద్దరికీ బాగా జ్వరం వచ్చి ఆసుపత్రిలో చేరారు.
                     తల్లిదండ్రులు ఇద్దరు ఆస్పత్రిలో చేరడం వల్ల కొడుకులు చంటి, బంటీలు ఇంటి ముందర కూర్చొని ఏడుస్తున్నారు. దేవుడా! మా అమ్మ నాన్నలకు జ్వరం తగ్గించు, మమ్మల్ని కాపాడూ అంటూ విపరీతంగా ఏడుస్తున్నారు. చిన్నపిల్లల ఏడుపు చూసిన గ్రామస్తులు తలా కొంత సాయం చేసి, ఆస్పత్రిలో డబ్బులు కట్టి, సుభాష్, రేఖ లను ఇంటికి తీసుకొచ్చారు. జ్వరం తగ్గినాక సుభాష్,  రేఖ లు రాత్రనకా, పగలనకా కష్టపడి డబ్బులు సంపాదించి అప్పులు కట్టేశారు. అప్పటి నుంచి వచ్చినంతలోనే కష్టపడి తింటూ కొడుకులను బాగా చూసుకుంటూ జీవించసాగారు.

నీతి: ఉన్నంతలోనే బతుకసాగాలి


-

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం