అడుగు జాడల్లో ఆనవాళ్లు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ప్రయాణం సాగుతూనే ఉంది వెలుతురు పెరుగుతూనే ఉంది  పైర్లతో నిండిన నేలంతా పచ్చదనాన్ని పరుచుకుంది ఇంతలో ఎదురుగా ఒక పెద్ద కొండ కనిపించింది అదే ఉమామహేశ్వరం కొండ  మొన్న మొన్నటి వరకు తెలంగాణ వారే కాదు ఉత్తరాది వాళ్లు కూడా  కాలినడకన శ్రీశైలం చేరుకునే ముందు విడిది చేసిన కొండది బాగా తెల్లవారింది ఆరు గంటల 30 నిమిషాలు అయింది ఉమామహేశ్వర ఆలయం చేరుకోవడానికి  ప్రాచీన కాలపు మెట్ల మార్గానికి ఎడమవైపున లక్షల మంది దప్పిక తీర్చిన కోనేరు ఉంది  చుట్టూ దట్టమైన అడవి మెట్లపై చెట్లు, పొదలు పెరుగగా ఇండియన్ కల్చర్ నేచర్ సంస్థ వ్యవస్థాపకులు పట్నం కృష్ణంరాజు ఆ పొదల్ని తొలగించి కోనేరుకు విముక్తి కలిగించినట్లు రెడ్డి గారితో చెప్పాడు ఆ కోనేరు కాకతీయుల కాలం నాటిది.
దానిని చూసిన తర్వాత బయటకు వస్తుంటే అక్కడ పాటుపడిన గుళ్ల వరస ముందు ఒక ఉమ్మడి మండపం కనిపించింది. వెళ్లి చూశారు రెడ్డి గారు అది ఏడు దేవాలయాల సముదాయం లోపల దేవుళ్ళు ఎవరు లేరు కప్పులు లేచి పోయాయి. మండపం రాళ్లు పడిపోయాయి కట్టడ శైలిని బట్టి ఆ దేవాలయ సముదాయం రేచర్ల పద్మనాయకుల కాలంలో నిర్మించిందనిపించింది ముళ్ళు పొదలు దాటుకుంటూ  చివరకు ఆలయం చుట్టూ తిరిగి చూడగలిగారు రెడ్డి గారు. ఒక నిమిషం ఆగారు ఆ శిఖరాలు చెప్పిన మౌన గాదల్నీ విన్నారు ఒకనాడు వైభవో పెతంగా వెలుగొందిన ఆలయం ఈరోజున వెలవెల పోవడం చూసి దేవుళ్ళు కూడా ఏమీ చేయలేకపోతున్నారే అని వాపోయారు రెడ్డి గారు ఇంకా కొంచెం ముందుకు వెళ్లారు.మరో సిధిలాలయం ఆలయ విడిభాగాలతో కట్టిన పిట్టగోడ అందులో అపురూప శిల్పాలు శాసనాలు ద్వారా శాఖలు కప్పు రాళ్లు ఇంకొంచెం ముందుకు వెళ్లారు నాలుగు ముక్కలుగా పడి ఉన్న క్రీస్తు శకం 1377 వ సంవత్సరపు పద్మనాయక రాజు మాదానాయకుని శాసనాలు చూసి చరిత్ర చెరిగిపోతుందన్న బాధ కలిగింది పట్టించుకోని ప్రభుత్వం పట్ల కసి రగిలింది రెడ్డి గారికి. ఇంకా ఏమైనా చరిత్ర శకలాలు దొరుకుతాయేమోనన్న ఆశ రెడ్డి  గారికి ఒక మూలాన ముళ్ళ పొదల మాటల నిర్లక్ష్యంగా పడి ఉన్న నిలువెత్తు వీరభద్ర నంది శిల్పాల వైపు మళ్ళించినాయి కాకతీయ శిల్పకళాపరాకాష్టకు ప్రతిబింబాలైన ఆ శిల్పాలు రెండు కూడా కాకతీయ ప్రతాపరుద్రుని కాలానివి అని ఉమామహేశ్వరంలోని ఒక శాస్త్రం ద్వారా తెలుసుకున్న రెడ్డి గారు ముక్కు మీద వేలేసుకున్నారు ఉమామహేశ్వరం ఆలయ అధికారులు ధర్మకర్తలు ఈ అపురూప శిల్పాలను కాపాడలేరా అనిపించింది. ఇంతకీ ఆ శిల్పాలు ఇక్కడికి ఎందుకు వచ్చాయని లోకపు చేస్తూ భిన్నమైన విగ్రహాలు ఆలయంలో ఉంటే అరిష్టమని వాటిని నిర్దాక్షిన్యంగా తోసేసి చేతులు దులిపేసుకున్నారని స్థానికులు చెప్పారు చూసిన కొద్ది చూడాలనిపించే వీరభద్ర నంది విగ్రహాల చరిత్ర తెలుసుకుందామని ఉమామహేశ్వరం శాసనాలను పరిశీలించారు రెడ్డి గారు.


కామెంట్‌లు