షి ఈస్ వర్సటైల్;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఆమె రెక్కలు విప్పి ఎగరాలే గాని ఆకాశం చిన్నదైపోదూ...!
ఆమె ఊహలకు ఆకృతిని అందించాలే కానీ వైపరీత్యాలు పుట్టుకురావూ...!
ఆమె గట్టిగా పిడికిలిని బిగించాలనే
గానీ ప్రతికూలతలన్నీ ఏక పక్షంగా అనుకూలించవూ...!
ఆమె అడుగులలో అడుగేసి సాగాలేగాని కనుగొనని తీరాలంటూ ఉంటాయా...!
నిన్నటి గతం, నేటి వాస్తవం, రేపటి భవిష్యత్తు మొత్తం అంతా ఆమె...
ఆమె ఏకవచనం కాదు
సమస్తం ఆమే...
భార్యగా బాధ్యతలు చేపట్టి 
సహచారిణిగా సలహాలు అందించేది...
తల్లిగా ఆలనా పాలనా చూసేది...
గురువై విద్యను బోధించేది...
అక్కై, చెల్లై, వదినై బంధాలలో భాగస్వామ్యాన్ని అందుకునేది...
ప్రేమ తీగలను పరచి కుటుంబ వ్యవస్థను పటిష్ఠం చేసేది...
ముంగిలిలో ముగ్గై, వాకిళ్లలో తోరణమై ఇంటికి కళను తెచ్చేది...
కోవెలలో దీపమై,
పరిపూర్ణ రూపమై సమయాన్ని నడిపించేది...
తన ఊపిరిని ఆయువుగా చేసి సృష్టికి ప్రాణం పోసేది...
సమస్త మానవ మనుగడను
తనలో సమ్మిళితం చేసుకొని
ఆదిశక్తిగా అవతరించి ఉద్ధరించేది ఆమే...
పాత్ర ఏదైనా ప్రాణం పోయాలంటే, ఆమెకు పిలుపునందివ్వాల్సిందే....
వేదికైనా, వేడుకయినా, శుభకార్యమైనా, అకార్యమైన
ఆమె పరిపూర్ణత వర్ణనాతీతం...
ఆమెకు రంగులతో, హంగులతో పనే లేదు ఆమె అస్తిత్వమే ప్రత్యేకం...
ఆమె పాదం మోపని చోట
పచ్చదనం పరిమళించదు...
ఆమె ఆదర్శం మాత్రమే కాదు.. అద్భుతం, అపురూపం కూడా...
అందుకే షి ఈస్ నాట్ జస్ట్ ఎ మల్టీ టాస్కర్ "షి ఈస్ వర్సటైల్..."


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం