1. కాలం వెనక్కి పోతోందా?
మతం రాజ్యం ఏలనున్నదా?
మతములు మాసిపోయాయా?
జ్ఞానమొక్కటే ,
నిలిచి వెలుగుతున్నదా?
2. మతాల ముసుగులో,
జ్ఞానం వెలుగు మసకబారింది!
మతం వ్యక్తిగతం ,
ధర్మం సామాజికం !
ధర్మం ప్రకృతి ,
మతం వికృతి !
చరిత్ర ,మతాల ,
మారణ హోమాల చితి!
3. మనుషుల్లో,
సయోధ్యే అయోధ్య !
నరుడికి షోడశ గుణాలు,
వస్తే రాముడు !
మన హృదయం ,
దైవానికి ఆలయం!
ఈశ్వరుడు ,
ఆత్మభవుడు ,వాస్తవం!
4. అధికారం ,
పేక ముక్కల జూదం!
మతం గెలిపించే,
తురుపు ముక్క!
వ్యసనం ,
జనాల కుదరని తిక్క!
సమాధానం,
దొరకని పిచ్చి లెక్క!
5. భారత రాజ్యాంగం,
పరమ ప్రమాణం !
మత ప్రసక్తి లేని ,
లౌకిక రాజ్యం ఆశయం!
గతాన్ని తవ్వద్దు ,
మతానికి లొంగద్దు !
శ్రేయో రాజ్యం,
భారతీయుల లక్ష్యం!
_________
భారతీయులం.;- డా పివిఎల్ సుబ్బారావు, 94410 58797..
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి