అంత కోపగించుకునే వాడివి ఈ బడిలో ఎందుకు చేరావు అన్న స్నేహితుడికి తల్లిదండ్రుల బంధువుల కోరికను తీర్చడం కోసం నేనీ పనిచేస్తున్నాను తప్ప నాకు ఇష్టమై నేను ఇక్కడ చేరలేదు గణతంత్ర బదిలీలతో పిల్లి పిల్లల వలే తిరుగుతూ ఎన్నో తరగతులు విశాఖపట్నం మొదలుకొని తుని స్కూల్ వరకు చదివాడు. తుని స్కూల్లో చదువుతున్న సమయంలో పేరిచర్ల సూర్యనారాయణ అన్న దేశభక్తి కలిగిన స్నేహితుడు దొరికాడు ఆయన కుశాగ్ర బుద్ధి సీతమ్మ కొండపై చేరి సాయంత్రం చర్చ చేస్తూ దేశ చరిత్రను నెమరువేస్తూ ఈ దేశంలో ఉన్న చారిత్రక ప్రదేశాలను దేవాలయాలను సందర్శించి ముందు మన దేశ చరిత్ర మనకు తెలిసేలా చేసుకున్నట్లయితే భావి జీవితంలో దానికోసం ఏం చేయాలో ఆలోచించవచ్చు అన్న ఆలోచన వచ్చింది రాజుగారికి. ఆలోచన రావడమే తడవు దానిని ఆచరణలో పెట్టడానికి మిత్రులు ఇద్దరూ దేశం మొత్తం తిరిగి వద్దాం అప్పుడు గాని మనకు సరైన మార్గం కనిపించదు అని ఆలోచించి ఇద్దరు కలిసి బస్సులో మాల్యం జైపూర్ ప్రాంతాలన్నీ తిరిగి తునికి వచ్చారు బడిలో అన్యాక్రాంతంగా ఉన్న సీతారామరాజును కనిపెట్టి మాస్టర్ గారు పేరు పెట్టి పిలిచి ఏరా ఏదో ఆలోచిస్తూ ఉన్నావు చదువుకోకపోతే ఎలా చదువుమాని సన్యాసిగా మారతావా అని కోపంగా అన్నప్పుడు ఈ క్షణం వరకు నాకు ఆ అభిప్రాయమే రాలేదు మీరు చెప్పిన తర్వాత అంతకుమించి నా గొప్ప అదృష్టం మనకు ఏముంటుంది తప్పకుండా సన్యాసినే అవుతాను అని సమాధానం ఆ ఉపాధ్యాయుడు మిగిలిన విద్యార్థులు అందరూ ఆశ్చర్యపోయారు.
ఆ కాలంలో తుని ఆస్థాన కవి వత్సవాయి వేలాద్రి రాజు గారి వద్ద జ్యోతిష్యం కవిత రక్షణా హటయోగ విద్యలను అభ్యసించాడు రాత్రి వేళల్లో శిథిలాలయాల్లో స్మశానంలో కొండ శిఖరి పైన తపస్సు చేయాలి అన్న అభిప్రాయంతో అతీత శక్తుల కోసం తపస్సు చేసాడు చించినాడలో మునుసబ్ గారి ఇంట గుర్రాన్ని చూసి శని ఆదివారాలలో అక్కడికి వెళ్లి ఆ గుర్రపు స్వారీ చేయడం ఎలాగో నేర్చుకున్నాడు దానితో అశ్వ శాస్త్రం తెలిసి దానిని గ్రంథస్తం కూడా చేశాడు గ్రంథాలయాలలో గజశాస్త్రాన్ని కూడా మదించి పుస్తకం రాశాడు భారత భాగవతాది భారత గ్రంథాలను చదువుతూ సంస్కృతం మీద శ్రద్ధ పెట్టాడు ఏదైనా పట్టిన పట్టు విడవని నేర్పు కడిగినవాడు అల్లూరి సీతారామరాజు అనుకున్నది చేసి తీరవలసినదే వెనకడుగు వేసే ప్రసక్తే లేదు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి