ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఎన్నో జిత్తులు పన్ని నన్ను చిత్తు చేయడానికి మీరు  ఎత్తులు వేస్తున్నారు  నా సోదరుల కోసం నా ప్రాణాలను అయినా ఇస్తాను కానీ  వారికి ఎలాంటి అపకారం చేయడానికి నేను ముందుకు రాను  వారిని తీర్చిదిద్ది ఉత్తమ పౌరులుగా తయారు చేయడం నా జీవిత ఆశయం వైరి వీరులు ఎంతమంది కలిసి వచ్చినా వారిని ఎదిరించడానికి నా మన్య సోదరులు ఐకమత్యంతో ఉండి ఏదైనా దానికి సిద్ధంగా ఉన్నారు  ఇలాంటి ఆలోచనలు సాగవు జాగ్రత్త అని హెచ్చరించి తిరిగి వచ్చాడు  తర్వాత  8 ఎకరాలు భూమిని రాజుకి ఇచ్చారు  పంటలు పండించుకుని జీవితాన్ని సుఖము చేసుకోమని సలహా కూడా ఇచ్చారు  ఈ విషయాలన్నిటిని  తన సోదరులకు తెలియజేశాడు  వారు కూడా రాజుగారు చెప్పినట్లుగా చేయడానికి సిద్ధమయ్యారు. ప్రభుత్వం వారు ఇచ్చిన భూమిలో  ఇండ్లు  గొడ్ల సావిడులు నిర్మించి ఆ నగరానికి శ్రీరామ విజయనగరము అన్న పేరు పెట్టుకుని ఎంతో ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నారు  ఆ కట్టిని ఎండలో వారిని ఉంచి వ్యవసాయం చేయడానికి ఉద్యమించి రెండు జతల ఎడ్లను రెండు పాడి ఆవులను  కొని సాగు చేసే పనిముట్లను  పశువుల శాఖలో ఉంచి  అతిథుల కోసం ఒకటి అతనికి మరొకటి రెండు కప్పిన పూరి ఇల్లు తయారు చేసుకున్నాడు  ఆ  ఇంటి  వసారాలలో కూర్చుని  వచ్చిన వారికి తీర్పుని చెప్పడం మొదలు పెట్టాడు రామరాజు  తరువాత తన తల్లిని చెల్లిని తమ్ముని బావను పిలిపించి ఆ ఇంట్లో కాపురం పెట్టాడు  దీనికి కారణం  అధికారులను నమ్మించడం కోసం అయినా అధికారులు అతనిని నమ్మక అతనిపై కాపలా పెట్టారు  ఆ కాపల అధికారులను ఏమార్చి అడవిలోకి వెళ్లి  నిషేధ దళాలను  తయారు చేయడం కోసం వారికి చాలా వరకు శిక్షణ ఇచ్చి తెల్లవారుజామున తిరిగి వచ్చేవాడు  కాపలా ఉన్నవారికి అతడు చేసే పని ఏమిటో అర్థం కాలేదు  తారకొండ పైన తపస్సు చేస్తున్న సమయంలో  హోమం చేయడానికి సిద్ధమైనప్పుడు  ఇష్ట దైవ పూజ  చేసేటప్పుడు  మండల దీక్షలో ఉన్నప్పుడు  చాలా పుస్తకాలను తన ఆయుధాలను విల్లు కొమ్ముగా   అభివృద్ధి చేసే తల్లి గుండె తలక్రిందులైయింది  శ్రీమాన్ మహారాజా అల్లూరి శ్రీరామరాజు  అంటూ పుస్తకాల పైన సంస్కృతంలో వ్రాసిన మాటలు  అతని భావం ఏమిటో ఎవరికీ తెలిసేది కాదు.


కామెంట్‌లు