కైకేయి;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322

 భార్యలు ముగ్గురికి సంతానం కావాలి ఒకరు  
ఎలా అందుచేత విశత్ అని బహువచనంలో చెప్పాడు దివ్య పాయసాన్ని పంచే సమయంలో కూడా ముగ్గురు రాణుల పేర్లు మనకు తెలుస్తుంది సగం ఇస్తాడు సుమిత్ర వద్దకు వెళ్లి మిగిలిన సగంలో సగం ఇస్తాడు మిగిలిన సగంలో సగం కైకే కి ఇస్తాడు ఇలా కైకేయికి ఎనిమిదో భాగం లభిస్తుంది మిగిలిన భాగం తీసుకెళ్లి సుమిత్రకు ఇస్తాడు కైకేయి కి రావలసిన భాగం పూర్తిగా  ఇవ్వడానికి దశరథుడు ఎందుకు సందేహించాడో మనం ఆలోచించవలసిన అవసరం ఉంది దేవతలాజ్ఞానుసారం కైకేయి కి మూడోవంతు పొందటానికి అధికారం కూడా ఉంది కానీ దశరథుడు దూర దృష్టితో కైకే చెందవలసిన మూడవ భాగంలో నుంచి కొంత తగ్గించి ఇవ్వటంతో ముగ్గురు భార్యలకు లభించిన పాయసంలో కైకేయికి లభించింది అతి స్వల్పమని చెప్పాలి.
దానివల్ల అర్థం చేసుకోవాల్సిందేమిటంటే సత్య ధర్మ పాలకుడైన దశరథుడు కౌసల్య పై ఎక్కువ కర్తవ్యం నిర్వహణను మోపాడు  కౌసల్య తన రాజ్యాధికారి కావాలి  అనే రాజు సంకల్పించాడు యువరాజు సకల గుణవంతుడై ధర్మపక్షపాలన చేసి కీర్తి ప్రతిష్ట పొందాలంటే పాయస ప్రసాదం ఎక్కువ మోతాదులో 
కౌసల్యాకే ఇవ్వవలసి ఉంది రాజు అందుచేతనే అధికంగా పాయసం కౌశల్యకు ఇచ్చాడు సుమిత్ర సహజ సరళ స్వభావం కలిగినది వినయ విధేయతలకు ప్రతిక సుమిత్ర అందుచేత ఆమె నుంచి  రాజకీయ వారసత్వం గురించి ఎటువంటి అభ్యంతరం ఉండదు  పక్షపాత ధోరణిలో జరిగిన ఆ పాయస పంపకంలోనే రామాయణ కథ వికాసానికి బీజం పడిందేమో అని అనిపిస్తూ ఉంటుంది. శ్రీమహావిష్ణు అవతార మూర్తి కారణంగా ఈ సంఘటన అనుసంధానంగా లభిస్తుంది.
సృష్టికర్త బ్రహ్మదేవతరణ తీసుకొని శ్రీమహావిష్ణు వద్దకు వస్తాడు  భువికి వెళ్లి దుష్టులను సంహరించమని ప్రార్థిస్తాడు భూలోకంలో పరాక్రమానికి సాత్వికతకు కీర్తికి ప్రాతినిధ్యం వహిస్తున్న దశరథుని మువ్వురు భార్యల గర్భంలో శిశువు జన్మించడమే సముచితంగా ఉంటుందని బ్రహ్మ సలహా ఇస్తాడు రాణుల పేర్లు చెప్పలేదు కానీ పరాక్రమానికి కౌసల్య శ్రీ (సాత్వికత)కి సుమిత్ర కీర్తికి కైకేయి ప్రతినిధుడని సులువుగానే అర్థం చేసుకోవచ్చు విచిత్రం ఏమిటంటే కీర్తికి ప్రతీక యైన కై కేయికి అప కీర్తి ఆపాదించబడినది ఈర్ష్యా ద్వేషాలకు ప్రతీకగా నిలిచిపోయింది  అందుకేనేమో ఆడపిల్ల పేర్లు కౌశల్య సుమిత్ర అని పెట్టుకుంటారే కానీ కైకేయిగా మాత్రం పెట్టుకోరు ఆమె  దుష్టురాలుగా  పరిగణించబడ్డదే కానీ నిజానికి ఆమె లోకం అనుకున్నంత దుష్ట బుద్ధి కానే కాదు.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం