వనవాసానికి వెళుతున్న శ్రీరామచంద్రుడు కాలు మోపిన నేల ప్రపంచ దేశాలకే ఆదర్శప్రాయమైన సీతమ్మ తల్లి పాదములు తగిలి పవిత్రమైన భూభాగం సౌమిత్రి దీక్షతో రక్ష చేసిన నేల ఇది. భద్రుని కన్న పవిత్ర నేల చుప్పనాతి ముక్కు చెవులు కోసిన నేల విరాధ రాక్షసుని వధించిన నేల జటాయువు భక్తితో సేవ చేసిన నేల ఖర దూషనుల బలిగొన్న నేల సాధుమృగముల తోట శాంతి నుండెడి నేల ఫలాలు పుష్పాలు నదీనదాలు చూడడానికి కనులకు ఇంపుగా ఉన్న నేల మునులు వేదగానాలను స్వరభద్దం చేసినటువంటి నేల తరాలకు తనివి తీరని నేల ఈ భరత్ నేల నేటికీ ఈ విధంగా పరుల స్వాధీనమైనది నా మాతృమూర్తి అంటూ రామరాజు ఎంతో దు ఖించాడు ప్రజల బాధలను చూసి వాటిని చక్క చేయడానికి గ్రామాలన్నీ తిరిగి వారందరికీ స్వాతంత్ర్య సిద్ధి కోసం చేయవలసిన కార్యాల గురించి బోధిస్తూ అన్నిటికీ మూలాన్ని తెలియజేస్తూ సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే పద్ధతిలో వారికి చెప్పడం వల్ల వారందరూ ఇతని బోధలను ఎంతో ఆసక్తితో వింటూ ఉండేవారు కాంట్రాక్టర్లు మీ దగ్గరకు వచ్చి మీకు కల్లు సారా నేర్పి మిమ్మల్ని దానికి దాసులని చేసి చివరకు వారికి కట్టు బానిసలుగా తయారయ్యేలా చేశారు మధ్య దళారుల మాటలలో చిక్కి వారికి వచ్చే కూలిలో సగం కూలి వారి కోసం కోల్పోవలసి వచ్చేది ప్రతిదానికి కోర్టుకు ఎక్కి ఉన్న సంపద మొత్తాన్ని నాశనం చేసుకున్నారు తాత తండ్రుల నుంచి వస్తున్న కాస్తంత అప్పుకై వెట్టిచాకిరి మిమ్మల్ని వెంబడిస్తోంది అని వారికి నూరిపోశారు. ఎన్ని బాధలు పడ్డా ఏ పూటకాపూట మీకు తిండి గడవకుండా పోతుంది మీకు మేలు చేయాలనే నేను ఇక్కడికి వచ్చాను నా మాట వినండి ముందు మీరు కల్లు మానినట్లయితే మీ కష్టాలు అన్నీ పోతాయి. ఆలుబిడ్డలు సౌఖ్యవంతులవుతారు మధ్య దళారుల మాటలు నమ్మి మీ కేసులు కోర్టు ఎక్కకుండా చూసుకోండి పోలీస్ సొమ్మును మింగి మిమ్మల్ని దగా చేసే దాగాకోరుల ఐక్యమై ఎదిరించి అడగవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి గ్రామంలో పంచాయితీలు పెట్టండి తగవులు వచ్చినట్లయితే న్యాయంగా తీర్పు చెప్పాలని చెప్పండి తరతరాలుగా ఉన్న ఈ భూమిపై హక్కుని మొదటి కానీ ఎవరు వచ్చిన ఆక్రమించడానికి సిద్ధమైనప్పుడు మీరందరూ ఏకమై నిలిచి మన్యంలో మాకు సాటి లేరు ఎవరు అని చెప్పండి అని వారికి బోధ చేస్తున్నాడు అల్లూరి సీతారామరాజు.
ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి