🪷కొబ్బరి అరటి చెట్లు...
ప్రకృతి పచ్చదనం తో
కనువిందు చేయు సీమ!
కోనసీమ! ఓ సుమతీ!
(2)
🪷ఉభయ గోదావరుల
నడుమ పేర్కొన్న దీవి!
కళ కళలాడు తున్న
భాగ్యసీమ! ఓ సుమతీ!
(అష్టాక్షరీ గీతి., శంకర ప్రియ.,)
🔆"కోనసీమ... ప్రకృతి రమణీయకతకు ప్రసిద్ధి చెందింది. తూర్పు గోదావరి జిల్లాలో... సప్తగోదావరి పాయలు, మరియు బంగాళాఖాతం మధ్య వున్న ద్వీపాల సమూహము! ఇది... 170 కి.మీ పొడవైన పరివాహక ప్రదేశమును కల్గియున్నది! దీనినే "కోనసీమ" అని, వ్యవహరిస్తారు
🪷గౌతమీ గోదావరికి జొన్నాడ వద్ద; వశిష్ట గోదావరికి సిద్ధాంతం వద్ద... భారీ వంతెనలు నిర్మించారు. అందువలన, కోనసీమకు ప్రయాణ సౌకర్యం ఏర్పడినది! ఆ విధంగా ఉభయ గోదావరి జిల్లాల వారికి రావులపాలెం "కోనసీమ ముఖద్వారం" అయినది.
🪷కోనసీమలో... అమలాపురం, అంబాజీపేట, కొత్తపేట, రావులపాలెం, రాజోలు, నగరం, ముక్తేశ్వరం, ముమ్మిడివరం.. వున్నాయి. అట్లే, అయినవిల్లి, మురమళ్ళ, కుండలేశ్వరం, మందపల్లి, అప్పనపల్లి, వాడపల్లి, అంతర్వేది, ర్యాలీ.. మున్నగు పుణ్య క్షేత్రములతో అలరారు చున్నదీ కోనసీమ!
🚩తేటగీతి పద్యములు
ఉభయ గోదావరుల మధ్య నున్నసీమ
వేద విజ్ఞాన శాస్త్ర కోవిదుల సీమ
ప్రకృతి రమణీయ శోభల పట్టు సీమ
క్రొత్త యందాల నెలవు మా కోనసీమ!
(2)
పల్లె శోభల వెలుగుల బాట యందు
పంట కాల్వలు నడిబొడ్డు పాఱుచుండ
పైరు గాలికి మనసెల్ల పరవశించి
మేను పులకించు సీమ మా కోనసీమ!
(రచన:- వేదుల సుబ్రహ్మణ్యo.,)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి