అక్షరాల హితబోధ;- -గద్వాల సోమన్న,9966414580
కలుసుంటే అందరం
అదెంతో సుందరం
మనసే మారితే
కాదా! అబ్బురం

మనిషి జన్మ అద్భుతం
చేసుకోకు జీవితం
అత్యంత వ్యర్థం
కావాలోయ్! సార్థకం

అనుమానం భూతం 
తెచ్చునోయ్! ప్రమాదం
మిగుల్చునోయ్! నిరాశ
తీయునోయ్! గుండె శ్వాస

అక్షరాల హిత బోధ
పోగొట్టునోయ్! బాధ
పెద్దవారి మాటలు
దిద్దునోయ్! బ్రతుకులు


కామెంట్‌లు