" ఒ" అక్షర పద గేయం;- -గద్వాల సోమన్న,9966414580
ఒజ్జ అంటే గురువు
బొజ్జ అంటే కడుపు
సజ్జనులతో చెలిమి
అమూల్యమైన కలిమి

ఒకటి ఒకటి కల్పిస్తే
అవుతుందోయి రెండు
ఒకటిగా కలిసుంటే
ఆనందమే మెండు

ఒంటెపై ప్రయాణం
ఎంతో సుఖప్రదం
ఒళ్ళును శుభ్రంగా
ఉంచిన ఆరోగ్యం

ఒంటరితనం మదిని
భీకరమైనది మహిని
ఒద్దిక కల్గియున్న
ఒడ్డాణంలా మిన్న


కామెంట్‌లు