మంగళ హారతి పాట;- వరలక్ష్మి యనమండ్ర
మంగళమని మంగళమని మంగళమనరే
మంగళమని మంగళమని మంగళమనరే
అంగనలందరు కూడీ మంగళమనరే. !!మం!!

నీలమేఘ శ్యామునకీ మంగళమనరే
గోపికా లోలునకూ మంగళమనరే. !!మం!!

దేవకీ తనయునకూ మంగళమనరే
కాళీయ మర్దనునకు మంగళమనరే!!మం!!

వేణుగాన లోలునకూ మంగళమనరే
వెన్నదొంగ కన్నయ్యకు మంగళమనరే!!మం!!

గోవర్ధనగిరి ధరునకు మంగళమనరే
గోపాల కృష్ణునకూ మంగళమనరే!!మం!!


కామెంట్‌లు