తిరుప్పావై ;- వరలక్ష్మి యనమండ్ర
17వ రోజు పాశురము

***********
అమ్బరమే తణీరే! శోణే! అఱమ్ శెయ్యుమ్ ఎమ్బెరుమాన్! నన్దగోపాలా! ఎళిందిరాయ్ కొంబనార్కెల్లామ్ కొళున్దే! కులవిళక్కే ఎమ్బెరు మాట్టి యశోదాయ్! అఱివుఱయ్ అమ్బర మూడఱుత్తు ఓంగి యులగళన్ద ఉమ్బర్ కోమానే ఉఱంజ్గాదు ఎళిందరాయ్ శెమ్ పొఱ్కళలడిచ్చెల్వా; బలదేవా ఉమ్బియమ్ నీయుమ్ ఉఱంగేలో రెమ్బావాయ్
**********
భావము ....పంచపదులలో
**********
17 వ పాశురము భావము 

అన్న వస్త్రములు దానము చేసెదవు
చల్లని నీటిని దానము చేయుదువు
ఉదారతతో నీవు దానంచేయుదువు
ఆపదలో ఉన్నవారిని ఆదుకొందువు
నందనందనా నిద్దుర లెమ్ము.. లక్ష్మీ

బుడి బుడి అడుగుల వామనుడా 
ముల్లోకములను కొలిచిన వాడా
కొలిచి కొలిచి నీవు అలసినవాడా 
శంఖ చక్రములు కలిగిన వాడా
మేలు కొలుపులివే మా నుండీ.. లక్ష్మీ

బలరామయ్యా నిద్దులెమ్ము
నీ తమ్ముని నీవు  నిద్ర లేపుము
గోపాలునకై వేచియున్నాము
మార్గశిర పూజను చేసెదము
మాధవ స్వామిని పూజింతుము.. లక్ష్మీ 

యాదవ కులపు యశమువు నీవు
మంగళ కరమగు మగువవు నీవు
చిన్ని కృష్ణుని నీవు రోటను కట్టావు
మన్ను తినెననినోరు చూపమన్నావు
నీవైనా నిద్దుర లేపుము కృష్ణయ్యను.. లక్ష్మీ
***********
   


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం