126)జనార్థనః -
దుఃఖమును తొలగించెడివాడు
ఆనందము ప్రసాదించువాడు
శ్రీహరి నారాయణుడైనవాడు
జనులను ఉద్దరించెడివాడు
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
127)వేదః -
మోక్షదాయకుడు అయినవాడు
జ్ఞానప్రసాదిగా యున్నట్టివాడు
వేద స్వరూపమున్నవాడు
వేదమాతను అనుసరించువాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు!ఉమా!
128)విదవత్ -
వేదజ్ఞాన రూపుడైనవాడు
వేదానుభావము గల్గినవాడు
వేదసారములు తెలుపువాడు
స్వామి వేదవేద్యుడైనవాడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
129)అవ్యంగః -
ఏ కొరతయునూ లేనివాడు
విలువకట్టలేనట్టి వాడు
ఘనత నిర్ణయించలేనివాడు
వ్యయమే లేనట్టి నిత్యుడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
130)వేదాంగః -
వేదములే అంగములైనవాడు
వేదములందు నివసించేవాడు
వేదముల సన్నిధినుండువాడు
వేదములులీనం చేసుకొన్నవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి