ఇటీవల జరిగిన నీతిఆయోగ్ ఉన్నతస్థా యి సమావేశంలో భారత ప్రధాని మోదీ పర్ డ్రాప్..మోర్ క్రాప్ అనే నినాదం ద్వారా నీటి సంరక్షణ, వినియోగంపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్న సందేశం బహు విలువైనది.. దేశంలో చాలా ప్రాంతాల్లో ఏర్పడిన కరవు, వర్షాభావ పరిస్థితులు ఎదుర్కోవాలంటే ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవాల్సిన అవసరం ఎంతో వుంది. ఇందుకోసం ప్రతీ పౌరుడిలో అవగాహన , తద్వారా తగు చర్యలు తీసుకునే విధం గా ప్రభుత్వం సమగ్రమైన కార్యాచరణ చేపట్టడం శ్లాఘనీయం. స్వాతంత్రానంతరం తొలిసారిగాఒక ప్రధాని ఈ విషయం లో అన్ని గ్రామాల సర్పంచులకు లేఖలు రాయడం ఈ అంశం పై ప్రధాని నరేంద్ర మోదీకి వున్న చిత్తశుద్ధి తేటతెల్లమౌతొంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఎనిమిది వేల కోట్ల రూపాయల తక్షణ సహాయం విడుదల చేయడం ముదావహం. జల వనరుల పొదుపు విషయం లో అన్ని ర్రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ విభేధాలను పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించడం ఎంతో అవసరం.వర్షాకాలం త్వరలోనే ప్రారంభమవుతున్నందున వాన నీరు వృథా కాకుండా తగిన చర్యలు చేపట్టేందుకు, ప్రతి వర్షపు బొట్టును భూమిలోకి ఇంకేవిధంగా గ్రామసభల్లో చర్చించి, తగినన్ని చెక్‌డ్యామ్స్, చెరువులు, కుంటలతో పాటుగా ఇళ్లల్లో ఇంకుడు గుంతలు ననిర్మించుకునేందుకు గ్రామ స్థాయిలో ప్రణాళిక చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం తగు సహాయ సహకారాలు అందించడం హర్షణీయం. బెంగళూరు, చెన్నయి నగరాలలో కొన్ని సాఫ్ట్ వేర్ కంపెనీలు ఆఫీసుల్లో నీళ్లు లేకపోవడంతో ఇంటినుంచే పనిచేయమని సిబ్బందిని ఆదేశించడం అక్కడున్న నీటి కరవును, నీటి దుస్థితిని తెలియచేస్తుంది. దీనికి కారణం ప్రజల్లో నీటిపై అజమాయిషీ, నియంత్రణ లేకపోవడం, నీటిపై వారికుండే అలసత్వం, చులకనభా వం మాత్రమే . భూగర్భం లోనికి ఇంకుతున్న జలాల కంటే మూడు రెట్లు జలాలను తోడేస్తునట్లు, 2022 నాటికి భీగర్భ జల మట్టం మరొక అయిదు మీటర్ల కిందకు పడిపోయీ తద్వారా భూగర్భ జలాలు విషతులయమయ్యే ప్రమాదం వుందని జాతీయ జలవనరుల మండలి తమ తాజా అధ్యయన నివేదికలో పేర్కొనడం పట్ల అందరూ అప్రమత్తం కావాలి.
నీటి సంరక్షణ మనందరి కర్తవ్యం- సి.హెచ్.ప్రతాప్

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి