నేను కవిత్వాన్ని;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
నేను
కవిత్వాన్ని
సత్యాన్ని
హృదయాన్ని

నేను
అక్షరాలని
పదాలని
భావాలని

నేను
పద్యాన్ని
వచనాన్ని
గేయాన్ని

నేను
ప్రాసని
యతిని
ప్రవాహాన్ని

నేను
ప్రణయాన్ని
ప్రళయాన్ని
ప్రబోధాన్ని

నేను
పువ్వుని
పొంకాన్ని
పరిమళాన్ని

నేను
నవ్వుని
మోముని
వెలుగుని

నేను
ఊహలని
కల్పితలని
భ్రాంతిని

నేను
రవిని
కాంతిని
పగలుని

నేను
జాబిలిని
వెన్నెలని
చల్లదనాన్ని

నేను
కడలిని
కెరటాలని
కుతూహలాన్ని

నేను
ఆకాశాన్ని
అహోరాత్రులని
అనంతాన్ని

నేను
గాలిని
సౌరభాన్ని
పయనాన్ని

నేను
పుడమిని
పర్వతాలని
పచ్చదనాన్ని

నేను 
నీటిని
వర్షాన్ని
ప్రవాహాన్ని

నేను
అగ్నిని
ఆవేశాన్ని
దహనాన్ని

నేను
కోకిలకంఠాన్ని
నెమలినాట్యాన్ని
హంసనడకలని

నేను
పలుకులని
తీయదనాన్ని
సందేశాన్ని

నేను
పసిదాన్ని
పడతిని
ప్రకృతిని

నేను
కలముని
కాగితాన్ని
కూరుపుని

నేను
పన్నీరుని
ప్రమోదాన్ని
ప్రోత్సాహాన్ని

నేను
అందాన్ని
ఆనందాన్ని
అంతరంగాన్ని

కవిత్వాన్ని
ఆహ్వానించండి
ఆస్వాదించండి
అనుభవించండి

కవులని
తలచుకోండి
తలలోనిలుపుకోండి
తన్మయత్వంపొందండి


కామెంట్‌లు