బొందయ్య తాతా వచ్చాడు
బందర్ లడ్డు తెచ్చాడు
విందు భోజనం అన్నాడు
అందరినచటికి పిలిచాడు
కొందరికి లడ్డు ఇచ్చాడు
సందులోన దూరాడు
ముందు ముందుకు కెళ్ళాడు
బంధువులందరు వచ్చారు
విందు భోజనం చేశారు
బందరు లడ్డూలు అడిగారు
ఎందుకు మీకు అన్నాడు
పొందుగా తప్పుకున్నాడు
సుందరం మామ వచ్చాడు
బొందయ్య తాతను పిలిచాడు
బందర్ లడ్డూలు అడిగాడు
అందరి చేతిలో పెట్టాడు !
అందరు లడ్డూలు తిన్నారు
సుందరయ్యను పిలిచారు
వంద రూపాయలు ఇచ్చారు
బందరు బస్సు ఎక్కారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి